సిటీలో హైటెక్ సెక్స్ రాకెట్.. కోడ్ ఎంటర్ చేస్తేనే విటులకు అనుమతి..
సిటీల్లో సెక్స్ రాకెట్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఎంత నిఘా ఉన్నా సరే లోలోన జరుగుతున్నాయి. అయితే విశ్వనగరి హైదరాబాద్‌లో కూడా పలుమార్లు సెక్స్ రాకెట్స్ బయట పడ్డాయి. అయితే ఈ సారి కాస్త డిఫరెంట్‌గా జరిగింది. కోడ్.. బెడ్ లాంటి కోడ్స్ ఉన్నాయి. సెక్స్ రాకెట్ కూడా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. రైడ్ చేసిన పోలీసులే విస్తుపోయారు. ఇదివరకు పబ్ డ్రగ్ మాదిరిగా యాప్, సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో ఖంగుతిన్నారు.

కొత్త టెక్నాలజీ
హైదరాబాద్‌లో సరికొత్త సెక్స్ రాకెట్ వెలుగుచూసింది. కొత్త టెక్నాలజీతో నడుపుతున్న సెక్స్ రాకెట్లో ఉగాండా దేశీయులు ఉన్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ రాకెట్ కోసం ప్రత్యేక యాప్ కూడా రూపొందించారు. అక్కడ నలుగురు ఉగాండాకు చెందినవారిని కనుగొన్నారు. వారిలో ముగ్గురు సెక్స్ వర్కర్లు కూడా ఉన్నారు. డేటింగ్ యాప్ ద్వారా కస్టమర్, నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్టు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. యాప్ లో ఉన్నవారంతా వీఐపీలే కావడం గమనార్హం.

సెక్యూరిటీ
బ్యాంకు యాప్‌లో సెక్యూరిటీ మాదిరిగా ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఫ్లాట్‌కు వచ్చే విటులు తప్పనిసరిగా ప్రత్యేక కోడ్ వాడితే ఎంట్రీ ఉంటుందట. సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తే విటులకు అనుమతిస్తారు. లేదంటే లోపలికి పంపించారు. హైటెక్ రీతిలో సెక్స్ రాకెట్ ఇప్పటి వరకు చూడలేదని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల డ్రగ్ కేసులోనూ ఇలాంటి యాప్ పోలీసులు గుర్తించారు. ఇప్పుడు సెక్స్ రాకెట్ విషయంలో ఇదీ బహిర్గతం అయ్యింది.

ఆ తర్వాతే సెక్స్
కస్టమర్ డబ్బులు చెల్లించడానికి అంగీకరించిన తర్వాత.. మహిళ వద్దకు వెళ్లేందుకు కోడ్ షేర్ చేస్తారు. కస్టమర్ అక్కడి వెళ్లి సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే మహిళతో సెక్స్ చేయడానికి అనుమతి ఉంటుంది. అనంతరం నిర్వాహకులు కస్టమర్ మొబైల్ ఫోన్ నుంచి వారి సంప్రదింపు వివరాలు, ఇతర సమాచారం తొలగిస్తారు. తద్వారా కస్టమర్ ఆ డేటాను దుర్వినియోగం చేయలేకుండా.. పోలీసులకు సాక్ష్యాలు దొరకకుండా ఉండే వీలుంది. రాకెట్ నిర్వహకులు ఇలా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ పోలీసులకు చిక్కారు. అందరినీ అరెస్ట్ చేశారు. సో ఎంత టెక్నాలజీ వాడినా.. చివరికీ పోలీసులకు పట్టుబడటం మాత్రం తప్పనిసరి అవనుంది.












Click it and Unblock the Notifications