హనీ‌ట్రాప్... కోటి రూపాయలకు వల వేసిన మాజీ ఎయిర్‌హోస్టెస్..! సహకరించిన భర్త

హైదరాబాద్‌లో మరో హనిట్రాప్ బయటపడింది. తమ వ్యాపార నష్టాలను పూడ్చుకునేందుకు ఇద్దరు భార్యభర్తలు కలిసి ఓ వ్యాపారిని ట్రాప్‌లో వేశారు. వ్యాపారితో సఖ్యతగా ఉన్న మహిళ తన వలపు వలను విసిరి మూడు నెలల పాటు తిప్పుకుంది. స్యచ్చంద సేవ పేరుతో వ్యాపారస్తున్ని ఆకట్టుకుంది. చివరకు ఓ రిసార్టుకు తీసుకెళ్లి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. రిసార్ట్‌లో మహిళకు ఆమే భర్త తోడయ్యాడు. తన భార్యతో ఉన్న ఉన్న వీడీయోలు చూపించి వ్యాపారిని బ్లాక్‌మెయిల్ చేశారు. కోటి రుపాయాలు ఇవ్వాలంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. వాటికోసం వ్యాపారిపై ఒత్తిడి తేవడంతో చేసేదేమి లేక వ్యాపారీ పోలీసులను ఆశ్రయించారు.

హైదరాబాద్‌లో పెరుగుతున్న హనీట్రాప్ కల్చర్

హైదరాబాద్‌లో పెరుగుతున్న హనీట్రాప్ కల్చర్

హనీట్రాప్ .. డబ్బున్న వాళ్లకు వలపు వల విసిరి వారిని బ్లాక్‌మెయిల్ చేయడం.. సమాజంలో గౌరవం మర్యాద ఉన్నవారిని సెలక్ట్ చేసుకుని వారితో సన్నిహితంగా ఉండి చివరకు బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజడం వారి లక్ష్యం. ఇలాంటీ హనీ ట్రాప్‌లు ఇతర మెట్రో నగరాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. ఆర్ధిక రాజధాని ముంబయి, ఢిల్లీ లాంటీ నగరాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటీ సంఘటనలు హైదరాబాద్‌లో ఈ సంస్కృతి కోరలు విప్పుతుంది. ఈనేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కనిష్క, మరియు విజయవాడకు చెందిన విజయ్ దంపతులు హైదరాబాద్‌ గచ్చిబౌలీలో నివాసం ఉంటు హనీట్రాప్‌కు తెర తీశారు.

 ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసిన కనిష్క

ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసిన కనిష్క

గతంలో విజయ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, కనిష్క ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. అనంతరం ఓ హోటల్ నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే హోటల్ వ్యాపారంలో నష్టాలు వచ్చినట్టు సమచారం. హోటల్ నష్టాలతో పాటు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఇద్దరు భార్యభర్తలు, తమ నష్టాలను పూడ్చుకునేందుకు హనీట్రాప్‌కు ప్లాన్ వేశారు. పరిచమైన ఓ వ్యాపారిని సెలెక్ట్ చేసుకుని ముగ్గులోకి దింపారు. కనిష్కా వ్యాపారితో సన్నిహిత సంబంధాలను పెట్టుకుంది. తాను ఓ స్వఛ్చంద సంస్థను నడుపుతున్నట్టు క్రియోట్ చేసింది. వారికి సహాయం చేయడంతో పాటు ఇతర కార్యక్రమాల్లో వ్యాపారిని భాగస్వామ్యం చేసింది. ఇలా తనవెంట రెస్టారెంట్‌లకు తిప్పుకుంటూ... నెమ్మదిగా ఆర్ధిక సహాయం కావాలని అడిగింది. కాగా ఇదంతా తన భర్త విజయ్ ఎప్పటిప్పుడు వీడీయోలను రికార్డ్ చేశాడు. ఇక ట్రాప్‌లో పడ్డ వ్యాపారి కనిష్కకు అప్పటికే పదిలక్షల రూపాయలను అందించాడు.

రిసార్ట్‌లో మాస్క్ తీసిన జంట

రిసార్ట్‌లో మాస్క్ తీసిన జంట

పదిలక్షలతో దాహం తీరని కనిష్కా జంట చివరి ప్రయత్నానికి తెరతీశారు. దీంతో ఓ రోజు వ్యాపారిని రిసార్ట్‌కు రమ్మని చెప్పి కనిష్కతోపాటు విజయ్ సైతం చేరుకున్నారు. అయితే విజయ్ రిసార్ట్‌లోని ఉండగా కనిష్కా ప్లాన్ అమలు చేసింది. రిసార్ట్‌కు చేరుకున్న వ్యాపారిని మాయమాటల్లో దింపి ,మత్తుమందు ఇచ్చింది.. ఆయన నిద్ర పోయిన తర్వాత తనను కొట్టినట్టుగా అనంతరం రక్తం బయటకు వచ్చిన సీన్ క్రియోట్ చేసింది. ఇక అర్థరాత్రి వ్యాపారి నిద్రలేసిన తర్వాత భర్త విజయ్ ఎంటర్ అయ్యాడు. భార్యతో తిరిగిన వీడియోలు జరిగిన సంఘటనపై ఏమీ తెలియనట్టు నిలదీశాడు.

బయటపడేందుకు కోటి రూపాయలకు ఒప్పందం

బయటపడేందుకు కోటి రూపాయలకు ఒప్పందం

అ నేపథ్యంలోనే కోటి రుపాయలు ఇవ్వాలని తేదంటే ఇద్దరి తతంగం బయట పెడతానని బెదించాడు. అనంతరం ఓ డమ్మి తుపాకితో సైతం బెదిరించాడు. ఇందుకు కోసం ఓ బాండ్‌ను కూడ రాయించుకున్నాడు. సంఘటన నుండి బయట పడేందుకు ఒప్పుకున్న వ్యాపారీ సంతకం పెట్టి బయటపడ్డాడు. ఒప్పందం ప్రకారం సంఘటన మరునాడే పదిలక్షల రుపాయలు ఇచ్చాడు. దీంతో మిగతా తొంబైలక్షల కోసం వ్యాపారీపై ఒత్తిడి తేవడంతో చివరకు ఆయన పోలీసులను ఆశ్రయించాడు. సైబరాబాద్ కమీషనరేట్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ట్విస్ట్ ఎమిటంటే కనిష్క హైదారాబాద్ వ్యాపారితో పాటు అమెరికాలో ఉంటున్న మరో వ్యక్తిని కూడ ట్రాప్ చేసినట్టు తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన ఫోటోలు , ఇతర వీడీయోలు కూడ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా జరిగిన విషయాన్ని అమెరికా వ్యక్తికి సమాచారం అందిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+