ఎల్బీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం: గ్యారేజీలోని 20 కార్లు దగ్ధం
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెకండ్ హ్యాండ్ కార్ల షోరూం(CAR -O-MAN) లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు షోరూంలోని టైర్లు అంటుకుని దట్టంగా పొగలు వ్యాపించాయి.
సమాచారం అందగానే ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేస్తున్నారు. కాగా, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్న సమయంలో గ్యారేజ్‌లోని రెండు సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. దీంతో పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.

కాగా, 20కి పైగా సెకండ్ హ్యాండ్ కార్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ప్రస్తుతం మూడు ఫైర్ ఇంజన్లు, డిజాస్టర్ మేనేమెంట్ ఫోర్స్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నాయి. దట్టంగా పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం సమీపంలోని స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు అధికారులు.
Major fire broke out in a car garage in LB Nagar #Hyderabad, 4 Fire Tenders reached the spot immediately. No casualties have been reported pic.twitter.com/IzlNRaI0gk
— Aneri Shah (@tweet_aneri) May 30, 2023
డ్రైవర్‌కు గుండెపోటు: రాజేంద్రనగర్‌లో లారీ బీభత్సం
హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఆగివున్న కారును ఢీకొట్టింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ధాన్యం లోడుతో లారీ కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. కాగా, గుండెపోటుతో డ్రైవర్ లారీలోనే మృతి చెందాడు. మరోవైపు, కారులో కొంతభాగం దెబ్బతింది. అందులో ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications