అదిరిపోయిన హైదరాబాద్ బిర్యానీ!
ఈ భూమి మీద హైదరాబాద్ బిర్యానీకి ఉండే క్రేజే వేరు. మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీ ప్రియుల నుంచి దీనికి అనూహ్య స్పందన లభిస్తుంటుంది. స్విగ్గీలో అత్యధిక ఆర్డర్లు పెట్టిన ఆహారంగా మన హైదరాబాద్ బిర్యానీనే నిలిచింది. తాజాగా, ట్రావెల్ గ్లోబల్.. ఈట్ లోకల్ అనే అంశంతో పని చేసే ప్రముఖ పర్యాటక ఆన్ లైన్ టేస్ట్ అట్లాస్ ప్రకటించిన ఉత్తమ ఆహార పరదార్థాల జాబితాలో కూడా ఇది చోటు సంపాదించుకుంది.
వివిధ దేశాలకు చెందిన నగరాలు.. అక్కడి ఆహార పదర్థాలపై సమీక్ష చేసిన ఈ సంస్థ జాబితాను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 నగరాల్లో హైదరాబాద్ బిర్యానీ 39వ స్థానాన్ని దక్కించుకోగా, ముంబయి 35వ స్థానం, ఢిల్లీ 56, చెన్నై 65, లక్నో 92వ స్థానంలో నిలిచింది. ఆహార పదార్థాల జాబితాలో అగ్రస్థానంలో ఇటలీ వంటకాలు నిలిచాయి. మన దేశ ఆహార పదార్థాల్లో పావ్ భాజీ, దోశ, వడాపావ్, కబాబ్స్, పానీపురి, బిర్యానీలను అధికంగా ఇష్టపడుతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.

హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఇది తయారుచేసే విధానంవల్లే దీనికి అంతపేరు వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో బిర్యానీలు తయారవుతుంటాయి. కానీ వాటన్నింటినీ తోసిరాజని హైదరాబాద్ బిర్యానీ పేరు సంపాదించుకుంది.
కొన్ని తరాలుగా పేరు నిలబెట్టుకుంటూ వస్తోంది. వినియోగదారుడు ఆన్ లైన్ ఫుడ్ సంస్థలద్వారా ఆర్డర్ చేసే ప్రతి మూడు వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీ ఒకటిగా నిలిచింది. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో బిర్యానీ తయారీని పూర్వీకులు ఎలా చెప్పారో అదే పద్ధతిలో చేసుకుంటూ వచ్చేవారున్నారు. రెసిపీ సరిగ్గా ఉండటమే దీనికి ప్లస్ పాయింట్.












Click it and Unblock the Notifications