గర్ల్‌ఫ్రెండ్ మాట్లాడలేదని క్షణికావేశం.. కత్తితో పొడుచుకుని సూసైడ్ అటెంప్ట్
హిమాయత్‌నగర్ : మూడేళ్లుగా సాగుతున్న ప్రేమాయణంకు ఎక్కడ ఫుల్‌స్టాప్ పడుతుందోనని కుమిలిపోయాడు బాయ్‌ఫ్రెండ్. ఫోన్ చేసినా కూడా ప్రేయసి స్పదించడం లేదని మనోవేదనకు గురయ్యాడు. ప్రియురాలు మాట్లాడటం లేదని క్షణికావేశానికి గురయ్యాడు. కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లో మూడు నాలుగు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
హిమాయత్ నగర్ ప్రాంతంలోని దత్తా నగర్‌కు చెందిన ఓ యువతి.. ఇంటి సమీపంలోని ఓ రెడీమెడ్ బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. అయితే అంబర్‌పేట పరిధిలోని చెన్నారెడ్డి నగర్‌లో ఉండే అమ్మమ్మ ఇంటికి తరచుగా వెళ్లేది. ఆ క్రమంలో మూడు సంవత్సరాల కిందట అక్కడే ఉండే ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీయడంతో వారిద్దరూ ప్రేమికులుగా మారిపోయారు.

ప్రేమ చిగురించగానే చెట్టాపట్టాలేసుకుని తిరిగామనేది బాయ్‌ఫ్రెండ్ వెర్షన్. దాదాపు మూడేళ్ల నుంచి ప్రేమాయణం సాగింది. ఇటీవల ఆమె ఫోన్ చేయడం మానేసింది. ప్రేమికుడు ఫోన్ చేసినా స్పందన కరువైంది. ఆ క్రమంలో ఇటీవల అమ్మమ్మ ఇంటికొచ్చిన గర్ల్‌ఫ్రెండ్‌తో వాగ్వాదానికి దిగాడట. దాంతో నీతో మాట్లాడేది లేదంటూ ఆమె తెగేసి చెప్పిందట. దాంతో విచక్షణ కోల్పోయిన సదరు యువకుడు కత్తితో కడుపులో పొడుచుకున్నాడు. పోలీసులకు విషయం తెలియడంతో ఆ యువకుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సదరు ప్రేమికుడు గతంలో కూడా ఇలాగే చేశాడట. ఆమె ఫోన్ చేయడం లేదని అలిగి చేయి కోసుకున్నాడట.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications