హైదరాబాద్‌లో కాల్పులు: హోటల్ జనరల్ మేనేజర్ మృతి

హైదరాబాద్: నగరంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి కాల్పులు జరిగాయి. మదీనాగూడలోని కిన్నెర గ్రాండ్ సందర్శిని ఎలైట్ రెస్టారెంట్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న దేవేందర్ గాయన్(35)పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు.

దేశవాలీ తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరపగా.. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా దేవేందర్ గాయన్ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

 Firing in Hyderabad: hotel general manager killed in miyapur.

దేవేందర్ స్వస్థలం కోల్‌కతాగా పోలీసులు తెలిపారు. కాల్పులకు పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దేవేందర్ హోటల్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని వచ్చి అతనిపై కాల్పులు జరిపారని.. కాల్పుల కోసం కంట్రీ మేడ్ పిస్టల్‌ని ఉపయోగించారని పోలీసులు పేర్కొన్నారు. అలాగే దేవేందర్ 6 నెలలుగా కిన్నెర గ్రాండ్ సందర్శిని హోటల్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు.

సంఘటన స్థలాన్ని మాదాపూర్ జోన్ డీసీపీ సందీప్ రావు, మియాపూర్ ఏసీపీ నరసింహారావు పరిశీలించారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీసీపీ సందీప్ రావు తెలిపారు. ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. పోలీసులు, క్లూ టీమ్‌ అన్నీ వివరాలను సేకరించాయి. ఇప్పటికే ఘటనా స్థలిలో 6 తూటాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కేసును కొద్ది గంటల్లోనే ఛేదించారు. 'నిందితుడిని రితీశ్​ నాయర్‌గా గుర్తించారు. కేరళకు చెందిన నిందితుడు రితీశ్​ నాయర్‌, దేవేందర్ గాయన్ గతంలో ఒకేచోట మేనేజర్లుగా పనిచేశారు. నెల రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇదే క్రమంలో రితీశ్​, దేవేందర్ ​పై చేయిచేసుకున్నాడు. ఇదే విషయాన్ని హోటల్‌ యాజమాన్యానికి దేవేందర్ ఫిర్యాదు చేశాడు. దీంతో రితీశ్‌​ను యాజమాన్యం తొలగించింది. దేవేందర్ వల్లే ఉద్యోగం పోయిందని రితీశ్ అతడిపై​ కక్ష పెంచుకున్నాడు.ఈ క్రమంలోనే కాల్పులు జరిపి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తుపాకీ పేలి.. టీఎస్ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ మృతి

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి టీఎస్ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ బుృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని హుస్సేనిఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా గడిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన భూపతి మాదయ్య-విజయలక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకాంత్(29) 2018లో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు.

ఇటీవలే హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాడు. మూడు నెలల క్రితం విధినిర్వహణలో భాగంగా అనపర్తి బెటాలియన్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చాడు. ప్రస్తుతం హుస్సేనిఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో కబూతర్‌ఖానాలో విధులు నిర్వహిస్తున్నాడు. గార్డు డ్యూటీలో ఉన్న శ్రీకాంత్.. బుధవారం తెల్లవారుజమున 3 గంటల సమయంలో తుపాకీ శుభ్రం చేస్తున్న సమయంలో పొరపాటున పేలింది.

తూటా గొంతులో నుంచి తలలోకి దూసుకెళ్లడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీకాంత్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, శ్రీకాంత్ కు మూడు నెలల క్రితమే నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది వేసవిలో వివాహం నిర్ణయించగా.. ఇంతలో ఈ ఘోరం జరిగిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+