అయ్యో యశస్విని.. చదువు కొనలేక తనువు చాలించింది -ఫీజు వేధింపులకు పేద విద్యార్థిని బలి

దాదాపు విషవలయంగా తయారైన విద్యావ్యవస్థలో మరో చిన్నారి సరసత్వతి కన్నుమూసింది. చదువంటే ఆమెకు ఇష్టం. నిరుపేద నేపథ్యమైనా పాఠశాలలో మాత్రం చదువుల తల్లే. పెద్ద ఉద్యోగం సంపాదించి, అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలన్న ఆ చిట్టితల్లి జీవితం, 15ఏళ్లకే ముగిసిపోయింది. ఆమె చదువుకుంటున్న ప్రైవేటు పాఠశాల ఫీజు కోసం పెట్టిన వేధింపుల్ని తట్టుకోలేక తన తనువు చాలించింది. విశ్వనగరం హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..

నెరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయనగర్‌లో ఉంటున్న హరిప్రసాద్‌ దంపతులు కూలిపనులు చేసి జీవనం గడుపుతున్నారు. వారి కుమార్తె యశస్విని (15) స్థానిక రవీంద్ర భారతి పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత పాఠశాలలు ప్రారంభం కావడంతో రోజూ స్కూల్‌కు వెళ్తోంది. ఈ ఏడాది పాఠశాల ఫీజు మొత్తం చెల్లించేయాలని విద్యార్థిని తండ్రితో పాటు యశస్వినికి కూడా పాఠశాల యాజమాన్యం తెలిపింది. కరోనా కారణంగా పనులు నిలిచిపోవడంతో ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉందని, కాస్త ఆలస్యమైనా, కచ్చితంగా కట్టేస్తామని హరిప్రసాద్‌ పాఠశాల యాజమాన్యాన్ని బతిమాలారు. అయితే..

 Hyderabad: Class 10 Girl student dies by suicide, parents allege harassment over school fees

యాజమాన్యం మాత్రం వారిపై కనికరం చూపలేదు. పాఠశాల తరగతులు జరుగుతున్న సమయంలో అందరి ముందూ యశస్వినిని ఫీజు చెల్లించాలంటూ స్కూలు సిబ్బంది వేధించేవారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది...

 Hyderabad: Class 10 Girl student dies by suicide, parents allege harassment over school fees

కూలీ పనుల నుంచి ఇంటికొచ్చిన తల్లిదండ్రులు, కూతురిని విగతజీవిగా చూసి కన్నీరు మున్నీరుగా రోదించారు. స్థానికులు నేరేడ్‌మెట్‌ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించామని, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. యశస్విని నుంచి మొత్తం రూ.37వేలను స్కూలు యాజమాన్యం డిమాండ్ చేయగా, అందులో రూ.10 వేలు ఇప్పటికే చెల్లించారని, మిగతా డబ్బును ఈనెల 20లోగా చెల్లిస్తామని చెప్పినా కనికరం లేకుండా వేధింపులకు పాల్పడటంతో ఈ దారుణం జరిగిందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+