సిటీలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. రెండు చోట్ల దాడులు, అరెస్ట్
విశ్వనగరి భాగ్యనగరిలో వ్యభిచార ముఠాలకు సంబంధించిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. దీంతో రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తోన్న వ్యభిచార ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు లోని రోడ్డు నెంబర్ 3లోని ఈ.డబ్ల్యూ.ఎస్ 154/1 ఇంట్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తన్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. అక్కడ నిర్వాహకుడు నాగ వెంకటేశ్వర రావును అరెస్ట్ చేశారు.
అతని నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి ప్రసాద్ రెడ్డి పరారీలో ఉన్నాడు. వీరిద్దరూ ఫోన్‌లో ఆన్‌లైన్‌లోనే యువతుల ఫోటోలు పంపించి విటులను ఆకర్షించేవారు. సదరు యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు యువతులను వేరే ప్రదేశంలో ఉంచి విటులు వచ్చినప్పుడు వారిని రప్పించి గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం సాగిస్తున్నారు. దీంతో పోలీసులు వల పన్ని వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధి సంజయ్ గాంధీనగర్‌కు చెందిన కటకం సాయి కుమార్ ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందటంతో ఆ ఇంటిపై దాడి చేసి సాయికుమార్‌తోపాటు ఇద్దరు మహిళలను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సాయికుమార్‌ను రిమాండ్‌కు పంపి మహిళలిు ఇద్దరిని రెస్క్యూ హోంకు తరలించారు.
సిటీలో పకడ్బందీగా వ్యభిచార ముఠాలు జరుగుతున్నాయి. కానీ కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. మరికొన్నింటికీ సంబంధించిన వివరాలు తెలియరాలేదు. మరోవైపు కొన్ని సెలూన్లలో కూడా వ్యభిచారం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో కూడా పట్టుబడ్డారు. తూతూ మంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఇప్పటికీ చాలా చోట్ల వ్యభిచారం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ వ్యవహారం మాత్రం గుట్టుగా సాగుతుంటుంది. కొన్ని చోట్ల డబ్బుల పంపిణీ తేడా రావడం వల్లే వెలుగుచూస్తున్నాయని అనేవారు కూడా ఉన్నారు. లేదంటే ఈ మాత్రం కూడా బయటపడేవి కావని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications