ఆస్తి పత్రాలిస్తావా.. ముఖంపై దగ్గి కరోనా అంటించమంటావా?: ఆస్తి కోసం మాజీ భార్య బెదిరింపు

హైదరాబాద్: కరోనావైరస్ మహమ్మారి కారణంగా సమాజంలో అనేక అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరోనాతో మరణించిన సొంతవారి అంత్యక్రియలకు కూడా కుటుంబ సభ్యలు దూరంగా ఉంటున్నారు. అంతేగాక, కరోనా వచ్చిందని తెలిసి మరికొందరు వారిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నారు. తాజాగా, నగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మహిళ తన మాజీ భర్తకు కరోనా అంటించేందుకు సిద్ధమైంది.

అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించిన మాజీ భార్య..

అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించిన మాజీ భార్య..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌‌లో నివసించే సంజీవరెడ్డి(70) ఓ మహిళను (38)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు(17) ఉన్నారు. సంజీవ రెడ్డి ప్రశాసన్‌నగర్‌లో ఆమె పేరిట ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. తర్వాత ఆ మహిళ మరొకరిని వివాహం చేసుకుంది. తండ్రి, కుమారులిద్దరూ నందగిరిహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, ప్రశాసన్‌నగర్‌లో కొనుగోలు చేసిన ఇంటి పత్రాల కోసం మే 31న ఆ మహిళ సంజీవరెడ్డి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించింది.

నీ మీద దగ్గి.. కరోనా అంటిస్తా.. మాజీ భార్య బెదిరింపులు

నీ మీద దగ్గి.. కరోనా అంటిస్తా.. మాజీ భార్య బెదిరింపులు

తన పేరిట ఉన్న ఇంటి పత్రాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. సంజీవరెడ్డిని దుర్భాషలాడింది. అంతేగాక, తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఆస్తి ఇవ్వకుంటే.. ముఖంపై దగ్గి వ్యాధిని అంటిస్తానంటూ బెదిరించింది. మాజీ భార్య వేధింపులతో బాధితుడు సంజీవరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మహిళపై ఐపీసీ 447, 341, 506 సెక్షన్ 3 ఎపిడమిక్ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు. కరోనా వచ్చిన ఆ మహిళ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకోవాల్సి ఉండగా, ఇలా బయట తిరగడం ఆందోళన కలిగించే విషయమే.

Recommended Video

    TOP NEWS : Congo | Etala Rajender | JP Nadda | Delta Variant
    తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

    తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

    తెలంగాణలో అమలు చేస్తున్న లాక్‌డౌన్ కారణంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివిటీ రేటు 2 శాతానికి పడిపోయింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2261 కరోనా కేసులు నమోదవగా, మరో 18 మంది మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిల 3043 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా. శ్రీనివాస రావు వెల్లడించారు. సాధారణంగా 5 శాతం కన్నా తక్కువ కోవిడ్ పాజిటివిటీ రేటు ఉంటే... లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో అది 2 శాతానికి పడిపోవడంతో... లాక్‌డౌన్ ఎత్తేసే సూచనలు కనిపిస్తున్నాయి. లేదంటే జూన్ 9 తర్వాత నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+