Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందమైన అమ్మాయిలతో సెక్స్ చాట్ పేరుతో.. అలా వల వేసి..

ఇన్‌స్టాగ్రామ్ నుంచి యువతుల ఫోటోలు డౌన్‌లోడ్ చేయడం.. వాటిని టిండర్ యాప్‌లో పెట్టి యువకులకు గాలం వేయడం.. ఈజీ మనీ కోసం ఓ సీఏ విద్యార్థి తొక్కిన అడ్డదారి ఇది. అమ్మాయిల ఫోటోలకు ఆకర్షితులయ్యే యువకులు మాటలు కలపాలని చూసేవారు. అందుకోసం వారి నుంచి డబ్బు గుంజేవాడు. సెక్స్ చాట్‌కి ఒక రేటు.. అశ్లీల ఫోటోలు,వీడియోలు పంపించడానికి ఒక రేటు చెప్పేవాడు. అలా వాళ్ల నుంచి గుంజిన డబ్బుతో హైదరాబాద్ పబ్బుల్లో ఎంజాయ్ చేసేవాడు. చాన్నాళ్లుగా సాగుతున్న సదరు సీఏ విద్యార్థి బాగోతాన్ని ఎట్టకేలకు పోలీసులు బట్టబయలు చేశారు.

ఎవరా యువకుడు..

ఎవరా యువకుడు..

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరంకి చెందిన వెన్నెల వెంకటేష్ విజయవాడలో సీఏ చదువుకుంటున్నాడు. అయితే జల్సాలకు డబ్బులు లేకపోవడంతో... అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ డౌన్‌లోడ్ చేసి.. అందులో నుంచి అందమైన యువతుల ఫోటోలు డౌన్‌లోడ్ చేసేవాడు. ఆ ఫోటోలను తిరిగి టిండర్ డేటింగ్ యాప్‌లో అప్‌లోడ్ చేసేవాడు.

సెక్స్ చాట్‌కి డబ్బులు గుంజేవాడు..

సెక్స్ చాట్‌కి డబ్బులు గుంజేవాడు..

వెంకటేష్ అప్‌లోడ్ చేసిన ఫోటోలకు ఆకర్షితులై... ఎంతోమంది యువకులు అవి ఒరిజినల్ ప్రొఫైల్సే అని నమ్మేవారు. వారితో మాట కలిపేందుకు అతనికి మెసేజ్‌లు పెట్టేవారు. ఇదే అదనుగా అతను.. చాట్ చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ ఎంతో కొంత గుంజేవాడు. అలా మెల్లిగా వాళ్లను సరస సంభాషణల్లోకి దింపి.. సెక్స్ చాట్ చేయాలంటే ఇంకాస్త ఎక్కువ డబ్బు ఇవ్వాలని చెప్పేవాడు. మాట్లాడుతున్నది అమ్మాయిలే అనుకుని ఆ యువకులు అడిగినంత డబ్బు సమర్పించుకునేవారు.

Recommended Video

    TDP Decleared Candidates Who Choosen From Party Leaders Family | Oneindia Telugu
    ఎట్టకేలకు అరెస్ట్..

    ఎట్టకేలకు అరెస్ట్..

    ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్‌కి చెందిన ఓ యువతి తన ఫోటోలతో టిండర్ యాప్‌లో ప్రొఫైల్ ఉండటాన్ని గమనించింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా వెంకటేష్ బాగోతం బయటపడింది. అతను విజయవాడలో సీఏ చదువుతున్నాడని గుర్తించి అరెస్ట్ చేశారు.విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు. టిండర్ యాప్‌లో యువకుల నుంచి గుంజిన డబ్బులతో హైదరాబాద్ పబ్బుల్లో ఎంజాయ్ చేసేవాడినని చెప్పాడు. విచారణలో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+