దేశంలో తొలిసారి హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్: బుకింగ్స్ ఓపెన్, రేట్లు ఇలా
హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ కు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 11న ప్రారంభం కాబోయే ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించిన టికెట్లను బుక్ మై షోలో విడుదల చేశారు. ఈ టికెట్ల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపాలిటీ, అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ హాజరయ్యారు.

తొలిసారి హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్
ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ప్రపంచంలోని టాప్ 25 నగరాల్లో హైదరాబాద్ ను చేర్చడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ రేస్.. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే టాప్ లీగ్‌లో ఉంచుతుందన్నారు. కాగా, మన దేశంలోనే తొలిసారిగా.. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరంలోనే నిర్వహించడం గమనార్హం.

హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ టికెట్ రేట్లు ఇలా
రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 22,500 టికెట్లను విక్రయించనున్నారు. రూ. 1000కు గ్రాండ్ స్టాండ్, రూ. 3,500కు ఛార్జ్ గ్రాండ్ స్టాండ్, రూ. 6 వేలకు ప్రీమియం గ్రాండ్ స్టాండ్, రూ. 10 వేలకు ఏస్ గ్రాండ్ స్టాండ్ టికెట్లను విక్రయించనున్నారు.టికెట్ల విక్రయం ఆన్‌లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్
అయితే ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ రేస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో 10వ తేదీన ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించనున్నారు. ఈ రేస్‌లో 11 దేశాల నుంచి మొత్తం 22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. రేస్ నిర్వహణ కోసం హుస్సేన్ సాగర్ తీరాన 18 మలుపులతో 2.8 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. గత నెలలో ఇండియన్ రేసింగ్ లీగ్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే.

ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఇక ఫార్ములా ఈ రేస్ నేపథ్యంలో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టనున్నారు. దీనికి సంబంధించి ప్రజలకు ముందుగానే ట్రాఫిక్ అడ్వైజరీ ఇస్తామని అధికారులు చెబుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉచిత ప్రవేశం కల్పించడం లేదని చెప్పారు. వీక్షకుల కోసం పెద్ద పెద్ద స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే, ఈవెంట్ మొదటి రెండు రోజులు స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉచితంగా ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications