ఘోరం: తార్నాకలో ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద మృతి
హైదరాబాద్: నగరంలోని తార్నాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. కాగా, మృతులను తమిళనాడులోని చెన్నైకి చెందిన దంపతులు ప్రతాప్(34), సింధూర(32), కుమార్తె ఆద్య(4), ప్రతాప్ తల్లి రాజతిగా గుర్తించారు.
వీరిలో ప్రతాప్ ఉరివేసుకుని మృతి చెందగా, మిగితా ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రతాప్ కార్ల షోరూంలో డిజైనర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సింధూర హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తోంది. వీరి మృతికి కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
ఆదివారం నుంచి తలుపు తీయకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూసే సరికి నలుగురు మృతి చెంది ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

కోట్‌పల్లి ప్రాజెక్టులో పడి ఒకే కుటుంబంలో నలుగురు మృతి
పండగరోజున విషాద ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి ప్రాజెక్టులో పడి నలుగురు యువకులు మృతి చెందారు. పండగ రోజు కావడంతో సరదాగా గడిపేందుకు కోట్‌పల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ఒడ్డున ఈదుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోయారు.
లోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరిఆడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు గుర్తించి మృతదేహాలు వెలికి తీశారు. మృతులను పూడూరు మండలం మన్నెగూడకు చెందిన లోకేశ్, జగదీశ్, వెంకటేశ్, రాజేశ్‌లుగా గుర్తించారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications