మెట్రోలో మందుబాబు హల్‌చల్.. మహిళలను తిడుతూ.. డ్యాన్స్ చేస్తూ..! (వీడియో)
హైదరాబాద్ : మెట్రో రైలులో మందుబాబు హల్‌చల్ చేశాడు. తాగిన మైకంలో తూలుతూ నోరు జారాడు. మహిళా ప్రయాణీకులను ఉద్దేశించి బూతులు వల్లించినట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్‌తో వీడియో తీస్తూ.. మధ్యమధ్యలో డ్యాన్స్ చేస్తూ హంగామా సృష్టించాడు. మెట్రో రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని భావించి అందులో ఎక్కితే అక్కడ కూడా ఇలాంటోళ్లు దాపురించారా అనే మాటలు ప్రయాణీకుల నుంచి వినిపించాయి.
సికింద్రాబాద్ టు తార్నాక మార్గంలో ప్రయాణిస్తున్న మెట్రో రైలులో ఎక్కాడు సదరు మందుబాబు. ఇంచుమించుగా ఫుల్లేసినట్లున్నాడు. ఇంకేముంది తాగిన మందంతా తలకెక్కి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. మద్యం సేవించి మెట్రో ఎక్కినోడు కుదురుగా ఉండక తోటి ప్రయాణీకులకు ఇబ్బందిగా మారాడు. మద్యం మత్తులో డ్యాన్సులు చేయడమే గాకుండా అసభ్య పదజాలంతో నోరు జారాడు.

సదరు మందుబాబు వాలకం చూసి కొందరు ప్రయాణీకులు భయపడ్డారు. మరికొందరు అదంతా సినిమా చూసినట్లు చూశారే తప్ప ఏ ఒక్కరూ కూడా అతడిని నిలువరించలేకపోయారు. దాంతో మందుబాబు మరింత రెచ్చిపోయాడు. కళ్ల జోడు పెట్టుకుని.. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని వీడియో తీస్తూ హంగామా చేశాడు. పెద్దగా అరుస్తూ ప్రయాణీకులను భయభ్రాంతులకు గురి చేశాడు. తాగుబోతు వీరంగంతో ఆ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నవారు చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు. చివరకు అతడు తార్నాక స్టాప్‌లో దిగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సికింద్రాబాద్ - తార్నాక మెట్రో మార్గంలో జరిగిన ఈ ఇన్సిడెంట్‌పై ప్రయాణీకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మందుబాబులను మెట్రోలోకి అనుమతించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇన్‌గేట్ దగ్గర డ్రంకెన్ చెకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
#HyderabadMetro #dgp_Telangana #cprachakonda
— Naveen Amboji (@naveenamboji) September 13, 2019
Drinker hulchal in metro sec-bad to Tarnaka pic.twitter.com/TskcSO8zAh












Click it and Unblock the Notifications