hyderabad metro: హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. అందుబాటులోకి షార్ట్‌లూప్ ట్రిప్పులు
హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)కు ప్రయాణికుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. ద్విచక్ర వాహనాల్లో వేళ్లే వారు ఎండలకు భయపడి చల్లిటి మెట్రో రైలు ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రోలో రద్దీ భారీగా పెరుగుతోంది. ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు పోటెత్తడంతో.. స్టేషన్లలో భారీగా రద్దీ కనిపిస్తోంది. గత గురువారం అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ముఖ్యంగా నాగోలు, రాయదుర్గం మార్గంలోని రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. నాగోలు మెట్రో స్టేషన్ కు ప్రయాణికులు భారీగా తరలిరావడంతో స్టేషన్ మొత్తం మందితో నిండిపోయింది. స్టేషన్ నిండిపోవడంతో ప్రయాణికులు స్టేషన్ మెట్లపై నిల్చోవాల్సి వచ్చింది.
ఉదయం వేళ్ల ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్రో ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు నడుపుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో నాగోలు, అమీర్ పేట రైల్వే స్టేషన్లలో నిమిషానికి ఓ రైలు నడిచినా రద్దీ తగ్గేలా కనిపించడం లేదు. ముఖ్యంగా నాగోలు, ఎల్బీనగర్, దిల్ షుఖ్ నగర్, కూకట్ పల్లి నుంచి ప్రాంతాల నుంచి ఎక్కువ మంది మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. కరోనా సమయంలో నష్టాల్లో కొనసాగిన మెట్రో.. తర్వాత క్రమంగా పుంజుకుంటుంది. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఆదాయం కూడా పెరుగుతోంది. అమీర్ పేట, రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లలో రద్దీ కొనసాగుతోంది.

ప్రస్తుతం రోజుకు మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య 4 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య ఐదు లక్షలు దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవరసం లేదని అధికారులు చెబుతున్నారు. మెట్రో రైళ్లలో పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్రో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీ మేరకు షార్ట్‌లూప్ ట్రిప్పులను నడుపుతోంది. దీనివల్ల ప్రయాణికులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు రద్దీని నియంత్రించవచ్చని మెట్రో అధికారులు చెబుతున్నారు.
అమీర్‌పేట్ నుంచి రాయదుర్గం వైపు వెళ్లాల్సిన ప్రయాణికులు నాగోల్ నుంచి వచ్చే ట్రైన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా అమీర్‌పేట్ నుంచి రాయదుర్గం వరకు ఈ షార్ట్ ట్రిప్పులు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మెట్రో నెట్‌వర్క్ ఉన్న అన్ని నగరాల్లో ప్రయాణికుల రద్దీ ఒక సాధారణ అంశమని హెచ్‌ఎంఆర్ ఎల్ అండ్ టీ పేర్కొంది. నగరంలో ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉందని, ముఖ్యంగా రాయదుర్గం వైపు వెళ్లే రైళ్లలో ఇది కనిపిస్తోందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications