హైదరాబాద్‌లో నోట్ల కట్టలు.. తొమ్మిదిన్నర కోట్లు సీజ్

హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల వేళ నోట్ల కట్టలు కోట్లల్లో బయటపడుతున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 9 కోట్ల 45 లక్షల అక్రమ నగదు పట్టుబడినట్లు తెలిపారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. ప్రజల సహకారంతోనే నోట్ల గుట్టు రట్టవుతోందని వెల్లడించారు. వారిచ్చిన సమాచారంతోనే 70 శాతం నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

hyderabad police caught 9.45 crores in election time.

ప్రజల సహకారం మరింత తోడైతే.. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో రెండు వందల కేసులు, 1,869 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. అయితే అక్రమ నగదు తరలింపులో పట్టుబడుతున్నవారిపై వెంటనే కేసులు పెట్టడం లేదని వివరించారు. దర్యాప్తు కోసమే వారిని అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+