ఆ చిన్నారి తొలి పుట్టినరోజుకు హైదరాబాద్‌ పోలీస్ బాస్ పెద్ద: తల్లిదండ్రుల తరఫున విషెస్

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ కొన్ని అనూహ్య సంఘటలకు ప్రత్యక్షసాక్షి అవుతోంది. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లిదండ్రుల తరఫున వారి కుమార్తె తొలి పుట్టినరోజు వేడుకకు పెద్దగా వ్యవహరించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. పేరెంట్స్ తరఫున దగ్గరుండి ఆ చిన్నారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేయించారు.

Recommended Video

    Baby gets Surprise Birthday Cake from Hyderabad Police ahead of Parents’ Request From US

    హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో చోటు చేసుకుంది ఈ ఘటన. హిమాయత్ నగర్‌లో నివసించే రామిరెడ్డి కుమారుడు, కోడలు అమెరికాలోని బోస్టన్‌లో నివసిస్తున్నారు. వారికి ఏడాది పాప. పేరు మైరా. ఇద్దరూ ఉద్యోగులే కావడంతో పాప సంరక్షణ కష్టతరమౌతోందని భావించిన వారు హిమాయత్ నగర్‌లో ఉండే తన నివాసంలో వదిలారు. పాప పుట్టినరోజు నాటికి హైదరాబాద్‌కు రావాలని భావించినప్పటికీ.. లాక్‌డౌన్ వల్ల వీలు కాలేదు.

     Hyderabad police celebrated the 1st birthday of a toddler Myra, her parents live in US,

    దీనితో పుట్టినరోజు వేడుకలకు దూరమౌతామని ఆందోళన చెందారు. తమ చేతుల మీదుగా చిన్నారికి పుట్టినరోజు వేడుకలను నిర్వహించలేకపోయారు. అదే సమయంలో వారు హైదరాబాద్ పోలీసులను సంప్రదించారు. తమ ఇబ్బందులను పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. కుమార్తె తొలి పుట్టినరోజుకు తాము హాజరు కాలేకపోతున్నామని, తమ తరఫున గ్రీటింగ్స్ తెలియజేయాలని వారు ఆయనకు విజ్ఙప్తి చేశారు.

     Hyderabad police celebrated the 1st birthday of a toddler Myra, her parents live in US,

    దీనితో అంజనీ కుమార్ వారి నుంచి వివరాలను సేకరించారు. పోలీసులతో కలిసి రామిరెడ్డి ఇంటికి వెళ్లారు. బెలూన్లు, బొమ్మలు, కేక్‌ను తీసుకెళ్లారు. కేక్ కట్ చేయించారు. మైరాకు బహుమతులను ఇచ్చారు. లాక్‌డౌన్ విధుల్లో తీరిక లేకుండా గడుపుతోన్న ఆయన చిన్నారి మైరా జన్మదిన వేడుకలకు పెద్దగా వ్యవహరించారు. పోలీసుల చర్యల పట్ల రామిరెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ లేకపోయి ఉంటే..పాప తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వచ్చే వారని, పోలీసులు ఆ లోటు లేకుండా చేశారని వ్యాఖ్యానించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+