మునావర్ ఫారూకీ కామెడి షోకి అనుమతి: మా కేటీఆర్ అంటూ రాజా సింగ్ తీవ్ర హెచ్చరిక

హైదరాబాద్: వివాదాస్పద స్టాండప్ కమెడియిన్ మునావర్ ఫారూఖీ కామెడీ షోకు హైదరాబాద్ పోలీసులు అనుమతిచ్చారు. శనివారం సాయంత్రం శిల్పాకళా వేదికలో మునావర్ ఫారూఖీ కామెడీ షో జరగనుంది. అయితే, హిందూదేవీదేవతలను అవమానిస్తూ గతంలో వ్యాఖ్యలు చేసిన ఇలాంటి వ్యక్తి కార్యక్రమానికి అనుమతివ్వడం పట్ల బీజేపీ, హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

మునవార్ షారూఖీ కామెడీ షోకి హైదరాబాద్ పోలీసుల అనుమతి

మునవార్ షారూఖీ కామెడీ షోకి హైదరాబాద్ పోలీసుల అనుమతి


ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. మునావర్ ఫారూఖీ కామెడీ షోను అడ్డుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశారు. పోలీసులు అనుమతివ్వవద్దని కోరారు. అయితే, పోలీసులు మాత్రం మునావర్ షోకు అనుమతిచ్చారు. మతంతో సంబంధం లేదని, కామెడీ షోకు అనుమతిచ్చామని పోలీసులు చెబుతున్నారు. కాగా, కేటీఆర్ గతంలోనే మునావర్‌ను హైదరాబాద్ కు ఆహ్వానించారు. కోవిడ్ కారణంగా గతంలో మునావర్ ఇక్కడికి రాలేదు.

మునావర్ షోకి అనుమతిపై రాజా సింగ్ ఆగ్రహం

మునావర్ షోకి అనుమతిపై రాజా సింగ్ ఆగ్రహం

హిందువులను కించపరిచే వ్యక్తి కార్యక్రమానికి ఎలా అనుమతిచ్చారంటూ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ షోకు అనుమతిచ్చిన పోలీసులు మరోసారి ఆలోచించాలన్నారు. హిందూ దేవుళ్లను అవమానించే వ్యక్తికి అనుమతిచ్చి.. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావాలని పోలీసులు భావిస్తున్నారా? అని రాజా సింగ్ ప్రశ్నించారు.

రాముడు, సీతను అవమానించే వ్యక్తి షోకి ఎలా అనుమతిస్తారు?

రాముడు, సీతను అవమానించే వ్యక్తి షోకి ఎలా అనుమతిస్తారు?

హిందూ దేవుళ్లను అవమానిస్తూ జరిగే మునావర్ షోను చాలా రాష్ట్రాలు రద్దు చేశాయని రాజా సింగ్ తెలిపారు. ఇటీవల ఇండోర్, ముంబై, కర్ణాటకలోనూ అతని కార్యక్రమాలు అక్కడి ప్రభుత్వాలు రద్దు చేశాయన్నారు. కానీ, దురదృష్టవశాత్తు మా కేటీఆర్.. రాముడిని, సీతను అవమానించే వ్యక్తి కార్యక్రమానికి అనుమతిచ్చారు అని రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి హిందూ మనోభావాలకు విలువ ఇవ్వదా? అని ప్రశ్నించారు.

మునావర్ సారీ చెప్పాలి: మా కేటీఆర్ అంటూ రాజా సింగ్

మునావర్ సారీ చెప్పాలి: మా కేటీఆర్ అంటూ రాజా సింగ్

హిందువులను అవమానించే వారికి ఎలా అనుమతిస్తారు? అని ప్రశ్నించారు రాజా సింగ్. మంచి కామెడి షోలను అనుమతిస్తే.. తాము స్వాగతిస్తామన్నారు. మా దేవుళ్లను అవమానించేవారికి అనుమతిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు రాజా సింగ్. హిందూ దేవుళ్లను అవమానించకుండా షో జరుగుతుందని కేటీఆర్ హామీ ఇవ్వాలని రాజా సింగ్ అన్నారు. అలా హామీ ఇస్తే తాము షోను అడ్డుకోబోమని తెలిపారు. అంతేగాక, గతంలో హిందూ దేవుళ్లను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలకు మునావర్ క్షమాపణలు చెప్పాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.

మునావర్ షోని ఎలా అడ్డుకుంటామో చెప్పిన రాజా సింగ్

మునావర్ షోని ఎలా అడ్డుకుంటామో చెప్పిన రాజా సింగ్

ఒకవేళ అలా జరగకపోతే తాము తప్పకుండా శనివారం జరిగే మునావర్ షోను అడ్డుకుంటామని రాజా సింగ్ హెచ్చరించారు. ఇప్పటికే తమ కార్యకర్తలు ఆ షోకు సంబంధించి ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకున్నారన్నారు. అయితే, తమ ఇంటి ముందు ఇప్పటికే పోలీసులు వచ్చారని.. ఇవాళో, రేపో అరెస్ట్ చేస్తారేమోనని అన్నారు. కానీ, తమ రామ సైన్యం మాత్రం మునావర్ షోను అడ్డుకుంటుందని రాజా సింగ్ చెప్పారు. ఆ కార్యక్రమంలోనే రాముడి బలమెంటో చూపిస్తామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+