జూబ్లీహిల్స్‌లో గన్‌తో హల్‌చల్.. ఎంపీ బంధువును అరెస్ట్ చేసిన పోలీసులు..
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గన్‌తో హల్‌చల్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం(జూన్ 10) అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో స్థానికులను వీరు గన్‌తో భయభ్రాంతులకు గురిచేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని సూరపనేని చైతన్య రామ్, బోడె వెంకట్‌లుగా గుర్తించారు. వీరిలో ఒకరు ఓ ఎంపీ బంధువుగా గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఆ ఎంపీ ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.

Recommended Video
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో మద్యం సేవించిన ఈ ఇద్దరు.. ఎంపీ స్టిక్కరింగ్ గల ఓ స్కార్పియో వాహనంలో కూకట్‌పల్లికి బయలుదేరారని పోలీసులు తెలిపారు. అయితే మార్గమధ్యలో మస్తాన్ నగర్‌లో పలు బైక్స్‌ను వీరి ఢీకొట్టినట్టు చెప్పారు. దీంతో కొంతమంది ఎదురు తిరగ్గా.. వారిపై గన్ గురిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డట్టు చెప్పారు. స్థానికులు దీనిపై తమకు సమాచారం అందించడంతో.. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. నిందితులు ఉపయోగించిన గన్ నకిలీదని,సినిమా షూటింగుల్లో వాడేదని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిని మాదాపూర్ పీఎస్‌లో విచారిస్తున్నట్టు సమాచారం.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications