Hyderabad: ఆ పోస్టులపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు..
సోషల్ మీడియా వల్ల చాలా మంది తప్పు దోప పడుతున్నారు. సోషల్ మీడియాకు ఎలాంటి క్రెడిబిలిటీ లేకపోవడంతో ఇష్టమొచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారు. కొంత మంది ఈ పోస్టులు నిజమని నమ్ముతున్నారు. అయితే ఈ పోస్టులపై పోలీసులు స్పందిస్తూ.. అవి తప్పని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అస్సలు విషయం ఏమిటంటే.. పలువురు నిరుద్యోగులు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు శనివారం హైదరాబాద్ లోని అశోక్ నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ భిక్షాటన చేశారు.
అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. "మరీ ఇంత దుర్మార్గమా! నిరుద్యోగులు భిక్షాటన చేయగా వారికి డబ్బులు ఇచ్చిందని ఒక మహిళను బలవంతంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులు" అని పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీ వేసిన ట్వీట్‌పై ఇవాళ హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. నిజాలు తెలుసుకుని పోస్టులు పెడితే బాగుండేదని తెలిపారు.

" నిజాలు తెలుసుకుని ఇక్కడ Post పెట్టి ఉంటే బాగుండేది. మీరు పెట్టిన పోస్ట్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. మీరు వీడియో చూపించిన అమ్మాయితో పాటు మరికొందరు ధర్నా చేస్తుండగా వారు shops లోకి వెళ్లి బిక్షాటన చేస్తున్నారు అని shops వారు పిర్యాదు చెయ్యగా పోలీస్ అక్కడకి చేరుకొని ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగకుండా అక్కడ ఉన్నవారిని పంపించారు. ఈ క్రమం లో అట్టి అమ్మాయి వారి నుండి తప్పించుకొని పక్కన ఉన్న ఒక అకాడమీ లోకి వెళ్లి తాను ఇక్కడ పని చేసే అమ్మాయి గా చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. పోలీస్ వారు మీరు చెప్పినట్టు ఆ అమ్మాయి ని అరెస్ట్ చెయ్యలేదు" అని పేర్కొన్నారు.
Your post is misleading people with false information . The facts are that the girl you are showing in the video was along with the group doing protest and begging from the shopkeepers to help their cause. The shopkeepers complained to police upon which police... 1/2
— Hyderabad City Police (@hydcitypolice) July 28, 2024
బీఆర్ఎస్ తో పాటు ఆ పార్టీకి అనుబంధంగా పని చేసే తెలుగు స్క్రైబ్ అనే ఎక్స్ హాండెల్ లో కూడా ఇదే పోస్ట్ పెట్టింది. దీనికి కూడా పోలీసులు స్పందించారు.












Click it and Unblock the Notifications