హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గీతదాటితే వేటే.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నయా రూల్..!!

|
Google Oneindia TeluguNews

మెట్రో నగరాల్లో ట్రాఫిక్ చిక్కులు మాములుగా ఉండవు. ఇక స్కూల్, కాలేజీ, ఆఫీసుకు వెళ్లి, వచ్చే సమయంలో చెప్పలేం. అవును అందుకోసమే ట్రాఫిక్ రూల్స్, వన్ వే, సిగ్నల్ రూల్స్ తప్పకుండా పాటించాలని పోలీసులు పదే పదే హెచ్చరిస్తారు. ఈ సారి హైదరాబాద్ పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించబోతున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ తప్పదని అంటున్నారు.

ఆపరేషన్ రోప్

ఆపరేషన్ రోప్


హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరు సోమవారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. దీని పేరు ఆపరేషన్ రోప్ (రీమూవల్ ఆఫ్ అబ్‌స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రొచ్‌మెంట్స్) దీని ప్రకారం రోడ్డు మీద వాహనాలు నిలుపరాదు. అలా నిలిపితే రూ.100 నుంచి రూ.1000 వరకు జరిమానా విధిస్తారు. మరొటి ఏంటంటే.. స్టాప్ లైన్ దాటితే రూ.200 ఫైన్ వేస్తారు. ఇదీ ట్రాఫిక్ నివారణకు, పాదచారుల రక్షణ కోసం చర్యలు తీసుకున్నారు.

 ఫైన్ ధరలు ఇలా

ఫైన్ ధరలు ఇలా


హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1384ఎఫ్ ప్రకారం, సెక్షన్ 39 (బీ) ప్రకారం టూయింగ్ చార్జీ రూ.200 అలాగే టూ వీలర్‌కు రూ.100 ఫైన్ విధిస్తారు. మోటార్ వెహికల్ సెక్షన్ 177 ప్రకారం ఫోర్ వీలర్‌కు టూయింగ్ చార్జీ రూ.600 అలాగే ఫైన్ రూ. 100 వరకు వేస్తారు. వాహనదారులు రోడ్డు మీద వెహికిల్స్ పెట్టొద్దని పదే పదే చెబుతున్నారు. రోడ్డు ఖాళీగా ఉంటేనే.. ట్రాఫిక్ సమస్య ఉండదని సీపీ సీవీ ఆనంద్ అంటున్నారు.

 స్టాప్ లైన్ దాటితే అంతే

స్టాప్ లైన్ దాటితే అంతే


సిగ్నల్స్ వద్ద వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో స్టాప్ లైన్ దాటొద్దని చెబుతున్నారు. అలా చేస్తే రూ.200 ఫైన్ వేస్తారట. ఫ్రీ లెప్ట్ టర్న్ వద్ద వాహనాలు గుమికూడొద్దని స్పష్టంచేశారు. ఆరంజ్ లైట్ పడిన సమయంలో వాహనాలు నిలిపివేయాలని కోరుతున్నారు. అంతేకాదు లెప్ట్ వైపు వెళ్లే ప్రయాణికులను వెళ్లనీయాలని కోరుతున్నారు.

English summary
Hyderabad traffic police launch a two-fold special drive starting from Monday, October 3 in the name of Operation ROPE
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X