కన్నకూతురిపై లాయర్ అత్యాచారం -పదేపదే కోరడంతో పాప ఆత్మహత్యాయత్నం -భార్య ఫిర్యాదు

విశ్వనగరం హైదరాబాద్ లో చోటుచేసుకున్న జుగుప్సాకర సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆడపిల్లల భద్రతపై నెలరోజులకు ఒకటి చొప్పున కొత్త చట్టాలు పుట్టుకొస్తున్నా పరిస్థితిలో మార్పులేదు. ఆడబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుటుంబ సభ్యులే నీచానికి ఒడిగడుతోన్న దాఖలాలు పెరుగుతున్నాయి. అందులోనూ.. రేపిస్టులకు శిక్షలు పడేలా వాదించాల్సిన న్యాయవాది ఒకరు.. కామంతో కళ్లుమూసుకుపోయి మైనరైన కన్నకూతురిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నార్సింగి పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్

ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్

వరంగల్ జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) గా పనిచేస్తోన్న సత్యానారాయణ గౌడ్ అంటే న్యాయవర్గాల్లో బాగా ఫేమస్. ప్రభుత్వం తరఫున అనేక కేసుల్లో తనదైన వాదన వినిపించి గొప్ప లాయర్ గా పేరుతెచ్చుకున్నారు. కానీ ఆయనలోని మరో చీకటి కోణాన్ని స్వయంగా భార్యాబిడ్డలే బయటపెట్టారు. వరంగల్ జిల్లాలో పీపీగా పనిచేస్తోన్న సత్యనారాయణకు హైదరాబాద్ లో కూడా ఇల్లుంది. భార్యాబిడ్డలు కూడా అక్కడే అతనితోనే నివసిస్తున్నారు. ఈక్రమంలో..

కూతురు పదో తరగతి..

కూతురు పదో తరగతి..

రంగారెడ్డి జిల్లా, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌షాకోట్‌, కపిల నగర్‌ కాలనీలో సత్యనారాయణ కుటుంబం నివసిస్తోంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతోన్న అతని కూతురు.. కొద్ది గంటల కిందట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కూతురు బలవన్మరణానికి ప్రయత్నిస్తుండగా తల్లి మంజుల గమనించి అడ్డుకుంది. ఎందుకీ పని చేస్తున్నావని నిలదీయగా బోరున ఏడుస్తూ తన బాధను వెళ్లగక్కింది..

బెదిరించి కూతురిపై వరుసగా..

బెదిరించి కూతురిపై వరుసగా..

కొంతకాలంగా తండ్రి తనపై సాగిస్తోన్న అఘాయిత్యాన్ని తల్లికి చెప్పుకుందా మైనర్ బాలిక. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి.. కూతురిని బెదిరించి అత్యాచారం చేశాడు. ఇంట్లో వీలుచిక్కినప్పుడల్లా పాపను బలవంతం ేచస్తూ నిత్యం అత్యాచారం చేస్తూ వచ్చాడు. కూతురి నోటి వెంట ఈ మాటలు విన్న తల్లి హతాషురాలైంది. మరునిమిషంలో ధైర్యం తెచ్చుకుని, బాధితురాలని వెంటతీసుకెళ్లి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తతో కూతురికి రక్షణ లేదని మంజుల పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+