Hyderabad: రియల్ ఎస్టేట్ వృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్..!
రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. నైట్ ఫ్రాంక్ ఇండియా ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ ప్రకారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధిలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాలను అధిగమించింది. నగరం రియల్ ఎస్టేట్‌లో విశేషమైన పురోగతిని చూపింది. గత దశాబ్దంలో రెసిడెన్షియల్ లాంచ్‌లలో 10 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR) ఉంది.
ఐటీ, ఫార్మాస్యూటికల్స్, తయారీ వంటి పరిశ్రమలకు హైదరాబాద్ నిలయంగా మారడంతో రియల్ ఎస్టేట్ వేగంగా వృద్ధి చెందుతోంది. మౌలిక వసతుల కల్పన కూడా వృద్ధికి కారణమైంది. రోడ్లు, ఫ్లై ఓవర్‌లు, అండర్‌పాస్‌లు, రింగ్ రోడ్‌ల విస్తృత నెట్‌వర్క్‌తో సహా హైదరాబాద్ లో వాతావరణం కూడా బాగుండడం ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. హైదరాబాద్ వృద్ధిలో మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్లు వంటి ప్రధాన ప్రాజెక్టులలో వ్యూహాత్మక ప్రభుత్వ పెట్టుబడులు కూడా కీలక పాత్ర పోషించాయని వివరించింది.

వ్యాపార, ఫ్రెండ్లీ వాతావరణంతో రాబోయే సంవత్సరాల్లో ప్రముఖ ప్రపంచ నగరంగా హైదరాబాద్ ఎదిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ ఆధారంగా భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితా చూసినట్లైతే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా.. బెంగళూరు, ముంబై-MMR,
ఢిల్లీ-NCR, అహ్మదాబాద్, చెన్నై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబై-MMR స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తుందని నివేదిక పేర్కొంది. మరోవైపు, బెంగళూరు ఐటీలో దూసుకెళ్తునట్లుగా వివరించింది.
రియల్ ఎస్టేట్‌లో బెంగళూరు రెండవ స్థానంలో ఉంది. ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. భారతదేశపు అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌కు నిలయం. ఢిల్లీ మెట్రో రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 6.8 మిలియన్లు ప్రయాణిస్తారని వివరించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత వృద్ధికి సిద్ధంగా ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications