వచ్చే మార్చిలోపు హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు: ఈ రూట్లలోనే!
హైదరాబాద్: నగరంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ బస్సులో త్వరలోనే రోడ్లపైకి రానున్నాయి. కొత్త ఏడాది కొత్త జోష్‌తో నగర రోడ్లపై సందడి చేయనున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు చారిత్రక నగర వీధుల్లో డబుల్ డెక్కర్ బస్సులను తిప్పేందుకు టీఎస్ఆర్టీసీ కసరత్తులను ముమ్మరం చేసింది.
2023 మార్చి నాటికి 10 డబుల్ డెక్కర్ బస్సులు నగరంలో పరుగులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 560 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు పిలిచింది. వీటిలో 50 జిల్లాలకు వెళ్లనుండగా.. 500 హైదరాబాద్ నగర వ్యాప్తంగా తిరగనున్నాయి. అయితే, 300 ఎలక్ట్రిక్ బస్సుల రాయితీకి సంబంధించి కోర్టు వివాదాలు తలెత్తడంతో వీటి రాక ఆలస్యమవుతోంది.

మిగితా 10 డబుల్ డెక్కర్ విషయంలోనూ ఎలాంటి ఇబ్బందుల్లేవని ఆర్టీసీ అధికారులు తెలిపారు. డబుల్ డెక్కర్లను వంతెనలతో ఆటంకం లేని మార్గాల్లోనే నడపాలని అధికారులు భావిస్తున్నారు.
ఆ మార్గాలను పరిశీలించినట్లయితే..
పటాన్‌చెరు-కోఠి
సికింద్రాబాద్-మేడ్చల్
సికింద్రాబాద్-పటాన్‌చెరు
సికింద్రాబాద్-లింగంపల్లి
అఫ్జల్ గంజ్-మెహిదీపట్నం
జీడిమెంట్ల-సీబీఎస్
కాగా, గత కొన్ని దశాబ్దాల క్రితం హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్‌కు నెటిజన్ల నుంచి హైదరాబాద్ నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు తీసుకురావాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీంతో కేటీఆర్.. డబుల్ డెక్కర్ బస్సులపై ఆర్టీసీకి సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications