WWE: హైదరాబాద్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్: ఎప్పుడు, ఎక్కడంటే?
హైదరాబాద్: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ-WWE) పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. మనదేశంలోనూ ఈ పోటీలకు పెద్ద క్రేజ్ ఉంది. తాజాగా తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఇది పెద్ద గుడ్‌న్యూసే. అది ఏంటంటే.. సెప్టెంబర్ 8న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) ఈవెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం "WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్" ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్విట్టర్‌లో వేదికగా వెల్లడించారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు. అంతర్జాతీయంగా పేరుపొందిన 28 మంది డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్స్ ఈ పోటీల్లో పాల్గొననున్నారు.

ఈ ఈవెంట్‌లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ 'ఫ్రీకిన్' రోలిన్స్, మహిళల ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, వివాదరహిత WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌లతో సహా కీలక WWE సూపర్‌స్టార్స్ హాజరవుతారని ఆయన తెలిపారు. అలాగే WWE సూపర్‌స్టార్లు జిందర్ మహల్, వీర్, సంగ కూడా ఇందులో పోటీపడనున్నారు.
Unveiled the wall poster of 2nd “Superstar Spectacle 2023”, a professional wrestling event produced by the American company WWE.
— V Srinivas Goud (@VSrinivasGoud) August 13, 2023
The event will take place on 8th September at the GMC Balayogi Indoor Stadium in Gachibowli & will feature WWE Superstars in action including: World… pic.twitter.com/iPq7i2fpp6
ఈ ఈవెంట్ టిక్కెట్లు www.bookmyshow.comలో అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి వైఏటీ అండ్ సి డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ ఆదివారం ఈ ఈవెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Your favourite #WWE Superstars are coming to Hyderabad, #India! Have you bought your #WWESuperstarSpectacle tickets yet?
— WWE India (@WWEIndia) August 7, 2023
🎟️: https://t.co/woLwL7JZ50@bookmyshow @WWE @SonySportsNetwk #WWELive #WWEIndia pic.twitter.com/iGcy8xt5pw
కాగా, దేశంలోనే రెండోసారి ఈ ఈవెంట్ నిర్వహిస్తుండగా.. హైదరాబాద్ నగరం తొలిసారి ఆతిథ్యం ఇవ్వనుంది. మరింత సమాచారం కోసం www.wwe.comను సంప్రదించవచ్చు.
Get your tickets now to watch The King of Claymore Country @DMcIntyreWWE in action at #WWESuperstarSpectacle, LIVE in Hyderabad! (Link in bio) @BookMyShow @WWE @SonySportsNetwk #WWEIndia #WWELive pic.twitter.com/XCBLqdtYVg
— WWE India (@WWEIndia) August 9, 2023
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications