సిటీలో ట్రాఫిక్‌కు ఇలా చెక్.. ఆర్టీసీ క్రాస్ రోడ్ మాదిరిగా.. ఇతర చోట్ల కూడా..

హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీయే కాదు.. ట్రాఫిక్ చక్రబంధం కూడా గుర్తుకొస్తోంది. సిటీలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌తో వాహనదారులే కాదు పోలీసులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన లేకపోవడంతో.. ఒకరి కారణంగా మరొకరు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై గంటల కొద్ది.. వాహనాలు బారులు తీరుతుండడంతో.. వాహనాలు నియంత్రించలేక ట్రాఫిక్ పోలీసులు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

 ఇలా చెక్..

ఇలా చెక్..

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జుంక్షన్ల వద్ద ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన ఫ్రీ లెఫ్ట్ విధానం.. ట్రాఫిక్ ను కొంతమేర తగ్గిస్తోంది. నగరంలోని ఇతర ప్రధాన జంక్షన్ల వద్ద కూడా ఈ ఫ్రీ లెఫ్ట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) రంగనాథ్ తెలిపారు.

మార్పు.. చేర్పులు

మార్పు.. చేర్పులు

ట్రాఫిక్ జంక్షన్లలో భారీ మార్పులు చేయనున్నట్లు జేసీపీ రంగనాథ్ వివరించారు. పలు జంక్షన్ల వద్ద రాకపోకలపై త్వరలో ఆంక్షలు విధించనున్నట్లు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, లంగర్‌హౌజ్, నానల్ నగర్..రవీంద్రభారతి, కంట్రోల్ రూమ్‌తోపాటు పలు జంక్షన్ల వద్ద మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సక్సెస్ అయిన ఫ్రీలెప్ట్ పద్ధతిని.. ఇతర రద్దీ జంక్షన్ల వద్ద అమలు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. ఫిల్మ్‌నగర్ నుంచి రోడ్డు నెంబర్ 10 వైపు వెళ్లే వాహనాలు అన్నింటినీ..జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి ఫ్రీ లెప్ట్ ఇచ్చి మళ్లిస్తారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వచ్చే వాహనాలను అన్నింటినీ నేరుగా..పంజాగుట్టకు చేరుకునేలా ట్రాఫిక్ మళ్లిస్తారు.

 ఈ మేరకు మార్పులు

ఈ మేరకు మార్పులు

వాహనాలు జంక్షన్ల వద్ద నిలిచిపోవడంతో.. వాహనదారుల ఇక్కట్లు గుర్తించి ఆ మేరకు ఈ మార్పులు చేస్తున్నట్లు జేసీపీ రంగనాథ్ వివరించారు. ఇప్పటికే నగరంలోని రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్ల మార్పులపై ప్రణాళికలు సిద్ధం చేసిన ట్రాఫిక్ పోలీసులు.. వారం రోజుల్లో ఆయా జంక్షన్ల వద్ద ట్రయల్స్ నిర్వహిస్తారు. గవర్నర్, ముఖ్యమంత్రి కాన్వాయ్ మినహా.. ఇతరాలు వాహనశ్రేణికి ట్రాఫిక్ నిబంధనలు సడలించేది లేదని జేసీపీ రంగనాథ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+