Hyderabad Weather:చంపేస్తోన్న చలి.. మూడు రోజుల పాటు డేంజర్ బెల్స్..!!

హైదరాబాద్: గత నవంబర్ నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వర్షాకాలం తర్వాత చలికాలం ప్రారంభమవడంతో తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలైనా సరే ఎండ వేడిమి అంతగా ఉండటం లేదు. చలికాలం కావడంతో సాయంత్రం త్వరగా చీకటి పడుతోంది. సాయంత్రం 5 గంటల నుంచే చలి క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ రాజధానిలో అయితే చలి ప్రజలను వణికిస్తోంది. ఉదయం వేళలో నగరంలోని పలు ప్రధాన రహదారులను పొగమంచు కప్పేస్తోంది దీంతో వాహనదారులు కాస్త ఇబ్బంది పడుతున్నారు.

మంగళవారం రోజున ఉష్ణోగ్రతలు కనీస స్థాయికి పడిపోయాయి. హైదరాబాదులో నమోదైన టెంపరేచర్ 14.9 డిగ్రీ సెల్సియస్‌గా ఉంది.అంటే సాధారణ స్థాయికంటే రెండు డిగ్రీలు తక్కువగా నమోదైంది. అంటే చలి ఏమాత్రం చంపేస్తోందో ఊహించుకోవచ్చు. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్ ప్రారంభంలోనే చలి క్రమంగా పెరుగుతోంది. అయితే మాన్‌డస్ తుపాను అటు ఏపీలో ప్రభావం చూపుతుండటంతో తెలంగాణలోని హైదరాబాదులో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.ఇదిలా ఉంటే ఈ వారాంతంలో హైదరాబాదులో వానలు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది.

 Hyderabad Weather:Chilling winter in the city,temperatures drop to 13 degrees

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం రాజేంద్రనగర్, సరూర్‌నగర్‌లో కనీస ఉష్ణోగ్రతలు 13.1 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయాయి. ఆ తర్వాత రామచంద్రాపురం, పటాన్‌చెరులో 13.3 డిగ్రీల సెల్సియస్, అల్వాల్‌లో 13.6 డిగ్రీల సెల్సియస్,గాజుల రామారంలో 13.6 డిగ్రీల సెల్సియస్, సికింద్రాబాద్‌లో 13.9 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 Hyderabad Weather:Chilling winter in the city,temperatures drop to 13 degrees

ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డిల్లో చలి తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని వాతావరణశాఖ పేర్కొంది. వృద్ధులు, చిన్న పిల్లలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం సూచిస్తోంది. స్వెటర్లు, తలలకు క్యాప్స్‌ ధరించి చలి నుంచి వృద్ధులు, చిన్నపిల్లలు తమను తాము కాపాడుకోవాలని వెదర్ డిపార్ట్‌మెంట్ సూచనలు జారీ చేసింది. వాతావరణం మరింత చల్లగా మారుతుండటంతో పలు జబ్బులు లేదా వ్యాధులు చాలా సులభంగా వ్యాపించే అవకాశం ఉన్నందున ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

 Hyderabad Weather:Chilling winter in the city,temperatures drop to 13 degrees
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+