హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం: వాహనదారుల ఇక్కట్లు, చల్లబడ్డ వాతావరణం

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా సాయంత్రం మారిపోయి వర్షం కురిసింది.

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కృష్ణాన‌గ‌ర్, అమీర్ పేట్, పంజాగుట్ట, కూకట్ పేట్, బాలానగర్, సుచిత్ర, తదితర ప్రాంతాల్లో ఈదురుగాలుల‌తో భారీ వ‌ర్షం కురిసింది. వరద నీరు పొంగి పొర్లడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ నిలిచిపోయి..వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్యాలయాల నుంచి తిరిగి వచ్చే సమయం కావడంతో పలు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ మంగళవారం వర్షాలు కురిశాయి.

Hyderabad weather update: heavy rains in hyderabad, two more days will continue

ఏపీలోనూ భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయని అనుకుంటుండగా.. మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ఆయా జిల్లాల ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5 .8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక -తమిళనాడు తీరం వైపునకు ప్రయాణించే అవకాశం ఉంది. మరొక ద్రోణి, నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల మీదనున్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు, సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి కారణంగా ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Recommended Video

    Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

    దక్షిణ కోస్తాలో రానున్న రెండ్రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ మంగళ, బుధవారాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గురువారం తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+