Hydra: తెలంగాణ స్పైస్ కిచెన్ రెస్టారెంట్‌ సందర్శించిన హైడ్రా కమిషనర్..

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ స్పైస్ కిచెన్ రెస్టారెంట్‌ను తనిఖీ చేశారు. ఆదివారం రాత్రి ఈ రెస్టారెంట్ లో పేలుడు జరిగిన ఘటన తెలిసిందే. హైడ్రా కమిషనర్ రెస్టారెంట్ యాజమాన్యంతో మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు. పేలుడు కారణంగా పరిసరాల్లోకి చెత్తాచెదారం ఎగిరి, వంట సామాగ్రి చెల్లాచెదురుగా ఉండటంతో నివాసితులలో భయాందోళనలకు దారితీసింది.

ఈ ఘటనలో ఓ యువతికి గాయాలైనట్లు తెలిసింది. తెల్లవారుజామున పేలుడు సంభవించింది, పొగలు చుట్టుముట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రెస్టారెంట్‌లో పేలుడు సంభవించడంతో హైదరాబాద్‌లోని అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేసిన సంగతి తెలిసిందే. సిటీలో కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న హైడ్రా ఆదివారం నుంచి పలు ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టింది.

Hydra Commissioner Ranganath inspected the Telangana Spice Kitchen restaurant in Jubilee Hills

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) శనివారం ఫిల్మ్ నగర్‌లో పలు కూల్చివేతలు చేపట్టింది. అధికారులు ముందుగా సర్వే చేసి తర్వాత కూల్చివేశారు. ఆదివారం శాస్త్రిపురం, వట్టేపల్లి రోడ్, జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్‌తో సహా పలు రద్దీ ప్రాంతాల్లోని ఆక్రమణలను కూల్చివేశారు. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, దుకాణాల ముందు నిర్మించిన షెడ్‌లను తొలగించారు. ఫుట్‌పాత్ ఆక్రమణల గుర్తించి తొలగించాలని హైడ్రా కమిషనర్ A.V. రంగనాథ్ బృందాలను ఆదేశించడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

హైడ్రా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ చెరువులను రక్షించడమే ధ్యేయంగా కీలక చర్యలు తీసుకున్నారు. చెరువు బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను కూల్చివేసింది. ఈ విషయం హైదరాబాద్ లో సంచలనంగా మారింది. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంతో సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+