Hydra: ఆ కట్టడాలకు సంబంధించి కీలక ప్రకటన చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్..!
హైదరాబాద్ లో చెరువులు, పార్కలు కజ్జాకు గురి కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా అనుకున్నట్లుగానే పని చేస్తోంది. ఇప్పటికే పలు చోట్ల చెరువులు, నాళాలను ఆక్రమించుకుని కట్టిన కట్టడాలను కూల్చేశారు. అలాగే చెరువులు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మిస్తున్న కట్టడాలను కూడా నేలమట్టం చేశారు. ఇక సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ లోని కొంత భాగాన్ని పడగొట్టారు. అలాగే చాలా చోట్ల కూల్చివేతలు చేపట్టడంతో బాధితులు హైడ్రాపై తీవ్రంగా మండిపడ్డారు.
అయితే హైడ్రా కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటుంది. ఈ మధ్య ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదు. వ్యతిరేకత వస్తుందని.. సైలెంట్ అయిందా లేక ఇతర కారణాలతో సైలెంట్ అయిందో తెలియరావడం లేదు. అయితే హైదరాబాద్ లో కొన్ని సంవత్సరాల క్రితం చాలా చెరువులు ఉండేవి. అయితే చెరువులు కబ్జా చేస్తూ వెంచర్లు వేస్తూ.. చెరువులు లేకుండా చేశారు. మిగిలిన చెరువులు కూడా కాపాడుకోవాలనే హైడ్రాను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పెద్దలు చెబుతున్నారు. తాగా హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

అనుమతులతో వెంచర్లు ఏర్పాటు చేసుకున్న వారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఆయన ఆదివారం మీడియాతో ముచ్చటించారు. చెరువుల వద్ద అనుమతులు ఉన్నా.. నిర్మాణాలు కూల్చివేస్తారని తమపై ప్రచారం చేస్తున్నారని చెప్పారు. చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న నిర్మాణాలు ముట్టుకోమని సీఎం చెప్పారుని.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంటుందని రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసినవారికి మాత్రమే హైడ్రా ఒక భూతం లాంటిదని శనివారం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
పేదలను మాత్రం ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవనం వేర్వేరు అంశాలని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మూసీని గత పాలకులు పట్టించుకోలేదని అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications