Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రియాంక గ్రూపులో ఉన్నాననే ప్రచారం, కేసులతో వేధింపులు.. రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ వ్యతిరేక శక్తులకు తాను మిత్రుడినని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను కుదురుకోవద్దని కేసీఆర్ అనుకూల వర్గం కోరుకుంటోందని హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు తాను ప్రియాంక గ్రూపులో ఉన్నాననే ప్రచారం ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఆరోపించారు. తనపై కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

 iam not a priyanka group.. revanth reddy clarify

కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడితే తనపై ఫిర్యాదులు వెళ్లాయని చెప్పారు. ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందని గుర్తుచేశారు. ఇక పార్టీలో కూడా తనను ఇబ్బందులకు గురిచేసే పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. తాను ప్రియాంక గాంధీ గ్రూపులో ఉన్నాననే కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారని వివరించారు. రాహుల్ గాంధీ కోసం పనిచేయడం లేదు అని ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ వారు చేసిన ఆరోపణలు ఊహాజనితలేనని.. ఏ ఒక్కటీ కూడా వర్కవుట్ కాలేదని స్పష్టంచేశారు.

Recommended Video

    COVID-19: Telangana లో విజృంభిస్తున్న Corona.. 70% కేసులు దాచి పెడుతున్న ప్రభుత్వం!| Oneindia Telugu

    తెలంగాణలో రాజకీయ శూన్యత లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త రాజకీయ పార్టీలు కావాలని తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. కానీ పోరాటం చేయాలని మాత్రం ఆశిస్తున్నారని చెప్పారు. ప్రజలు ఆకాంక్ష మేరకు తాము పనిచేయడం లేదనే భావన వారిలో బలంగా పాతుకుపోయిందని వివరించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+