Hyderabad: హైదరాబాదీలకు షాక్.. ఇక మీ జేబుకు చిల్లే..!
హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. ఇక నుంచి కఠినంగా నిబంధనలు అమలు చేయనున్నారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడపడం, రాంగ్ రూట్ లో వెళ్లడం వంటి చేస్తే భారీ జరిమానా విధించనున్నారు. గతంలో హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే రూ.100 ఫైన్ వేసేవారు. ఇప్పడు ఆ జరిమానాను 100 శాతం పెంచారు. అంటే ఇక నుంచి వితౌట్ హెల్మెట్ తో వాహనం నడిపితే రూ.200 ఫైన్ విధించాలని నిర్ణయించారు. రూ.35 ఛార్జీలు కూడా ఉండనున్నాయి.
ఇక రాంగ్ రూట్లో వెళ్తే.. ఇక అంతే సంగతి. రాంగ్ రూట్లో వెళ్తే భారీగ జరిమానా విధించనున్నారు. రూ.2000 ఫైన్ విధించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దీనికి తోడు రూ.35 ఛార్జీలు కూడా ఉంటాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ అధికారి విశ్వప్రసాద్ ఆదేశాల జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే మోటర్ వెహికల్ చట్టం ప్రకారం గరిష్ఠంగా జరిమానా విధించాల్సి వస్తుందన్నారు. అలాగే హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపేవారు, రాంగ్ రూట్లో వెళ్లే వారికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సిబ్బందికి స్పష్టం చేశారు.

వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లను కూడా వసూలు చేయాలని సూచించారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. అయినప్పటీకి కొంత మంది వాహనదారుల్లో మార్పు రావడం లేదు. అందుకే జరిమానా పెంచినట్లు తెలుస్తోంది. సో ఇక నుంచి ఇక నుంచి మీరు హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే రూ.235 చెల్లించాల్సిందే. ఇక రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తే రూ.2035 కట్టాల్సిందే. గతంలో రాంగ్ రూట్లో వెళ్తే రూ.1000 జరిమానా విధించే వారు. కొన్ని సందర్భాల్లో కోర్టుకు కూడా హాజరు పరిచేవారు.
రాంగ్ రూట్ డ్రైవింగ్ పై ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. రాంగ్ రూట్ వెళ్లి చాలా మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ చాలా మంది రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. కొద్ది రోజులు క్రితం కూకట్ పల్లి ఓ వ్యక్తి స్కూటర్ పై రాంగ్ రూట్ లో వచ్చాడు. యూ టర్న్ ఎస్ టర్న్ తీసుకోవాలని చూసి రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. కూకట్ పల్లి నుంచి జేఎన్టీయూ వెళ్లే మార్గం యూ టర్న్ ఉంది. జేఎన్టీయూ మార్గం నుంచి కూకట్ పల్లి సైడ్ రాంగ్ రూట్ లో వచ్చాడు. యూ టర్న్ వద్ద రోడ్డకు అటువైపు వెళ్లాలని ప్రయత్నించాడు. అప్పుడే బస్సు ఢీకొట్టింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications