Hyderabad: హైదరాబాద్ లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు..!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం జరుగుతోంది. కానీ భాగ్యనగరంలో ఇళ్ల ధరలు పెరిగినట్లు ఓ నివేదిక బయట పెట్టింది.
హైదరాబాద్‌తో పాటు మరో ఆరు నగరాల్లో కూడా ధరలు పెరిగాయని రియల్ ఎస్టేట్ సేవల సంస్థ అనరాక్ (ANAROCK) పేర్కొంది. ఆరు సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో అత్యధిక పెరుగుదల కనిపించిందని వివరించింది. 2024 రెండో త్రైమాసికంతో పోలిస్తే, 2024 మూడో త్రైమాసికంలో ధరలు నాలుగు శాతం పెరిగాయని తెలిపింది.

అయితే 2023 క్యూ3 నుంచి 2024 క్యూ3కి హైదరాబాద్‌లో నివాస ప్రాపర్టీ ధరలలో 32 శాతం పెరుగుదల నమోదు అయినట్లు వివరించింది. ఇది దేశంలోని మొదటి ఏడు నగరాల్లో అత్యధికమని పేర్కొంది. హైదరాబాద్ లో రెండో త్రైమాసికంలో స్క్వేర్ ఫీట్ కు రూ.6,900 ఉండగా.. మూడో త్రైమాసికంలో రూ.7,150 పెరిగింది. చెన్నైలో క్యూ2లో స్క్వేర్ ఫీట్ కు రూ.6,500 ఉండగా క్యూ3 లో 6,680కి చేరింది. బెంగళూరులో క్యూ2లో రూ.7,800.. క్యూ3లో 8,100 చేరింది.

In the third quarter of 2024 house prices in Hyderabad have increased significantly

పెరుగుతున్న ఖర్చులతో టాప్ ఏడు నగరాల్లో సగటు నివాస ఇళ్ల ధరలు 23 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. హైదరాబాద్, ఇతర అగ్ర నగరాల్లో నివాస ప్రాపర్టీ ధరలు పెరగడంతో గృహాల అమ్మకాలు క్షీణించాయని వివరించింది. కోల్‌కతాలో అమ్మకాలలో అత్యధిక క్షీణత కనిపించింది. 2023 మూడో త్రైమాసికం నుంచి Q3 2024 వరకు 25 శాతం తగ్గాయని తెలిపింది. విక్రయాల్లో హైదరాబాద్‌ రెండో అత్యధిక క్షీణత నమోదు చేసినట్లు పేర్కొంది.

కల్ కత్తాలో అమ్మకాలు Q3 2023లో 16,375 యూనిట్లు అమ్ముడవగా.. Q3 2024లో 12,735 యూనిట్లు అమ్ముడయ్యాయి. హైదరాబాద్ లో అమ్మకాలు క్షీణించడానికి హైడ్రా కూడా కారణమని పలువురు చెబుతున్నారు. చాలా వరకు కట్టడాలు చెరవుల బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా ఇళ్ల కొనుగోలుకు వెనకాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+