Sukumar: దర్శకుడు సుకుమార్ ఇంట్లో సోదాలు ఎందుకు జరిగాయంటే..!

టాలీవుడ్లో ఐటీ(IT) సోదాలు కలకలం సృష్టించాయి. బుధవారం హైదరాబాద్ లోని ప్రముఖ దర్శకుడు సుకుమార్(Sukumar) ఇంటితో పాటు జూబ్లీహిల్స్ లోని మైత్రి మూవీ మేకర్స్ లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. అధికారులు దాదాపు 12 గంటలపాటు మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఉదయాన్నే నాలుగు వెహికిల్స్ లో వచ్చిన ఐటీ బృందాలు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో సోదాలు చేశాయి.

ఐటీ అధికారులు మైత్రిలో పని చేస్తున్న ఉద్యోగుల నుంచి కొంత సమాచారం సేకరించారు. అధికారులు అకౌంట్ మేనేజర్లు, ప్రొడక్షన్ యూనిట్ సిబ్బందిని ప్రశ్నించారు. ఉద్యోగుల జీతాల చెల్లింపులపై కూడా ఐటీ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు ప్రొడక్షన్ యూనిట్, అకౌంట్ మేనేజర్లను ఏప్రిల్ 20న మరోసారి విచారించున్నారు.

Income tax officials raids in tollywood director sukumar house and mythri movie makers office in hyderabad

అధికారులు జూబ్లీహిల్స్‌లోని యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్‌లతో కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు. సుకుమార్ ఇళ్లు, మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ ల్లో ఐటీ అధికారులు సోదాల సందర్బంగా కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. మైత్రి మూవీ మేకర్స్ జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు..

ఐటీ రిటర్న్‌లలో తప్పుడు వివరాలను అందించినందుకు గాను సోదాలు చేసినట్లు తెలిసింది. సినిమాల నిర్మాణ యూనిట్ల కొనుగోలు, వాటికి సంబంధించిన పన్నులపై ఐటీ రిటర్న్ లలో నిబంధనలను ఉల్లంఘించారని అధికారులు గుర్తించారు. గతంలో కూడా మైత్రి మూవీ మేకర్స్ సోదాలు జరిగాయి.

GST నిబంధనలను ఉల్లంఘించినందుకు, వారి ఆదాయపు పన్ను రిటర్న్‌లలో (ITRs) తప్పుడు వివరాలను అందించారని ఆరోపణలతో మైత్రీ మూవీ మేకర్స్ నివాసాలు, కార్యాలయ ప్రాంగణాల్లో గత ఏడాది డిసెంబర్‌లో వస్తు సేవల శాఖ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు.

2015లో ప్రారంభమైన మైత్రీ మూవీ మేకర్స్ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం పుష్ప2, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమాలు తీస్తోన్నట్లు తెలిసింది.

సుకుమార్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడిగా కొనసాగుతున్నారు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప సినిమాలు బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు సుకుమార్. సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.500 కోట్లతో నిర్మిస్తున్నారు. పుష్ప 2 సినిమా కోసం సుకుమార్ ఏకంగా రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+