పార్టీ నిర్మాణానికి అవిశ్రాంత కృషి.. పేదల సంక్షేమమే ఎజెండా: ఇందిరా శోభన్

ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఇందిరా శోభన్‌కు పార్టీ కీలక బాధ్యతలను అప్పగించింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయాలని కోరింది. దీంతో జాతీయ కన్వీనర్ గౌరవ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జీ సోమనాథ్ భారతికు ఇందిరా శోభన్ కృతజ్ఞతలు తెలియజేశారు. తన మీద ఉన్న నమ్మకంతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త కమిటీల ఏర్పాటు, పార్టీ నిర్మాణం, విస్తరణ బాధ్యతలతోపాటు పార్టీ బలోపేతానికి తగిన నిర్ణయాలు తీసుకునేందుకు పూర్తి స్వేచ్ఛను కల్పించిన సోమనాథ్ భారతికి ధన్యవాదాలు తెలియజేశారు.

తక్కువ సమయంలో ప్రజల ఆదరణ పొంది, అద్భుత విజయాలను సొంతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు అవిశ్రాంత కృషి చేస్తానని చెప్పారు.కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య, వైద్యం, విద్యుత్ పథకాలు దేశానికే ఆదర్శం అని చెప్పారు. 90 శాతం పేద, మధ్యతరగతి ప్రజలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ లో ఉచిత విద్య, వైద్యం, విద్యుత్ తోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఎజెండా అని తెలిపారు.

indira shoban angry on cm kcr

కులం, మతం, ప్రాంతాల పేరుతో స్వార్ధ రాజకీయాల కోసం డబ్బు, అధికారమే పరమావధిగా తెలంగాణలో పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. 60 ఏళ్ల పోరాటం, ఎంతో మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి రాజకీయ పార్టీలు తహతహలాడుతున్నాయని విమర్శించారు. దోచుకోవడం, దాచుకోవడం తప్పా తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో అవినీతిమయంగా మారిన రాజకీయాలను ప్రక్షాళన చేసే లక్ష్యంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుందన్నారు. సామాన్యుడికి అధికారం అందిస్తుంది. అధికారానికి దూరంగా ఉన్న వర్గాలను అసెంబ్లీకి పంపిస్తుందని చెప్పారు. కొత్త నాయకత్వం, కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీతో పనిచేసేందుకు మేధావులు, విద్యావంతులు, యువకులు, మహిళలు మరియు విద్యార్థులు కలిసి వస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. తెలంగాణలో స్వచ్ఛమైన పాలన అందించడమే ఎజెండాగా ముందుకు వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+