మనుషుల అక్రమ రవాణాకు బ్రేక్..! అంతర్జాతీయ ముఠా గుట్టురట్టు (వీడియో)
హైదరాబాద్ : మనుషుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టైంది. నకిలీ వీసాలు, పాసుపోర్టులతో మనుషులను విదేశాలకు తరలిస్తున్న అంతర్జాతీయ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ ఈ ముఠా సభ్యులు మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. 18 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామన్నారు.
నిందితుల నుంచి 250 నకిలీ పాస్‌పోర్ట్‌లు, వీసాలు, 38 సెల్ ఫోన్లు 160 పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్స్, 6 కంప్యూటర్లు, 5 ల్యాప్ టాపులు, రెండు ప్రింటర్లతో పాటు కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు సీపీ. మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటివరకు 14 కేసులు నమోదు చేసి 71 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో 21 మంది పరారీలో ఉన్నట్లు చెప్పారు.

దేశమంతటా ఇలాంటి ముఠాలు రెచ్చిపోతున్నాయన్నారు సీపీ. నకిలీ వీసాల దందా యదేచ్ఛగా నడుస్తోందని.. ముంబైలోని రిజిస్టర్డ్ ఏజెంటుతో తాజాగా దొరికిన ముఠాకు లింకులున్నట్లు తెలిపారు. చేవెళ్ల ప్రాంతం నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇప్పించారని.. ఓ కానిస్టేబుల్ ఈ ముఠా సభ్యులకు సహకరించారని ధృవీకరించారు.
-
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications