Hyderabad: హైదరాబాద్ లో చల్లబడిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. !
హైదరాబాద్ గత మూడు రోజులు వాతావరణం చల్లగా ఉంది. ఉదయం కాస్త ఎండ ఉండి సాయంత్రానికి మబ్బులు వస్తున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. గురువారం సాయంత్రం, శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. శనివారం కూడా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. శనివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం వాతావరణం కాస్త చల్లబడింది.
సాయంత్రం 4 గంటల తర్వాత పలు ప్రాంతాల్లో చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్, బేగంపేట, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ లో వర్షం కురిసింది. మరోవైపు సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.. వీచే అవకాశం ఉందని వివరించింది.

భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, సేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 10 వరకు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. తెలంగాణలో రుతుపవనాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. రెండు రోజుల్లో రాష్ట్రమంతా వ్యాపించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications