మల్లారెడ్డి ఐటీ దాడుల్లో కొత్త కోణం, క్యాసినో పెట్టుబడులపై ఐటీ అధికారుల ఆరా

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ దర్యాఫ్తులో కొత్త కోణం వెలుగుచూసింది. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జై కిషన్ ఇంట్లో సోదాలు చేశారు. గతంలో చీకోటి ప్రవీణ్‌తో కలిసి క్యాసినో వ్యవహారాల్లో ఇతను కీ రోల్ పోషించాడు. మల్లారెడ్డి సీఎంఆర్ స్కూల్ పార్టనర్‌గా జైకిషన్ తండ్రి నర్సింహ యాదవ్ ఉన్నారు. జైకిషన్ ఇంట్లోనూ సోదాలు చేశాయి.గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ నేతలపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. వరుస దాడులతో టీఆర్ఎస్ నేతల్లో అలజడి నెలకొంది.

 50 బృందాలు..

50 బృందాలు..

మంత్రి మల్లారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులు, కూతురు, అల్లుడు, వియ్యంకుడు, బంధువులు, సన్నిహితులు నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి. 50 బృందాలు తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో తనిఖీలు చేశాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో దాడులు కొనసాగిస్తున్నారు. మల్లారెడ్డికి వివిధ ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. యూనివర్సిటీ, 38 ఇంజినీరింగ్ కాలేజీలు, రెండు మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు ఉన్నాయని గుర్తించారు.

 క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావుపై ప్రశ్నలు

క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావుపై ప్రశ్నలు


మల్లారెడ్డి విద్యా సంస్థల నగదు లావాదేవీలు బాలానగర్‌లో గల క్రాంతి బ్యాంక్ లో జరిగాయని ఐటీ అధికారుల వద్ద ఆధారాలు సేకరించారు. ఆ బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వరరావును కూడా ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల పాటు ఐటీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

బంధువుళ ఇళ్లలో

బంధువుళ ఇళ్లలో


మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి నివాసంలో దాడులు చేపట్టారు. రూ.2 కోట్ల నగదు సీజ్ చేశారు. అతను సుచిత్రలో నివాసం ఉంటున్నారు. ఐటీ అధికారులు ఉదయం నుంచే త్రిశూల్ రెడ్డి నివాసంలో సోదాలు చేపట్టారు. త్రిశూల్ రెడ్డి కూడా పలు కాలేజీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి నివాసంలో మరో రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, సికింద్రాబాద్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోనూ ఐటీ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+