Hyderabad: హైదరాబాద్‍లోని పలు ప్రాంతాల్లో జల్లులు..
హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుంచి చిరు జల్లులు కురుస్తున్నాయి. బోరబండ, మోతినగర్ ఎస్సార్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డికపూల్, మాదాపూర్, జూబ్లీహిల్స్ లో చిరు జల్లులు కురిశాయి. ఈ రోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.హైదరాబాద్‌లో మధ్యాహ్నం, సాయంత్రం వర్షం పడుతుందని అంచనా అంచనా వేసింగి. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఇదే వాతావరణం ఉంటుందని పేర్కొంది.
మరోవైపు హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈరోజు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌కు సంబంధించి నగరంలోని మొత్తం ఆరు మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) నివేదిక ప్రకారం నిన్న రాష్ట్రంలో అత్యధికంగా వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట మండలంలో 72 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం హైదరాబాద్‌లో కూడా అత్యధికంగా షేక్‌పేటలో 19.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరానికి నేటి వర్షపాతం సూచన ప్రకారం ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో మూడు రోజుల్లో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications