అట్టహాసంగా ముగిసిన హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్: విజేతగా ఎవరంటే?
హైదరాబాద్ నగరంలో అట్టహాసంగా జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ శనివారం ముగిసింది. కాగా, 25 పాయింట్లతో జా ఎరిక్ వా మొదటి స్థానంలో సాధించి విజేతగా నిలిచాడు.
హైదరాబాద్: నగరంలో అట్టహాసంగా జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ శనివారం ముగిసింది. కాగా, 25 పాయింట్లతో జా ఎరిక్ వా మొదటి స్థానంలో సాధించి విజేతగా నిలిచాడు. నిక్ క్యాసిడ్ 18 పాయిట్లతో రెండో స్థానంలో, 15 పాయింట్లతో ఆంటోనియో ద కోస్తా మూడో స్థానంలో నిలిచాడు. ప్రధాన రేస్‌లో మొదటి స్థానంలో నిలిచిన విజేత అయిన జా ఎరిక్ వా కు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్రోఫీ అందించారు.
హైదరాబాద్ ఈ కార్ రేస్ విజేతగా ఎవరంటే.?
భారత మోటార్ స్పోర్ట్స్‌లో కొత్త అధ్యయానికి తెరతీస్తూ ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్ షిప్ నగరంలో మొదలైన విషయం తెలిసిందే. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన రేసింగ్ సర్క్యూట్‌లో ఫార్ములా ీ రేసు కార్లు వాయు వేగంతో దూసుకెళ్లాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన రేసర్లు కార్లలో దూసుకెళ్లారు. జాగ్వార్, నిస్సాన్, కప్రా, అవలాంచ్, మహింద్రా కార్లు ట్రాక్‌పై పరుగులు పెట్టాయి. మొత్తం 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌లో 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు రేస్‌లో పాల్గొన్నారు. ఈ రేసులో విజేత జా ఎరిక్ వాకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్రోఫీ అందించారు.
ఫార్ములా ఈ రేసులో సెలబ్రిటీల సందడి
కాగా, ఫార్ములా ఈ రేస్ ను వీక్షించేందుకు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తరలివచ్చారు. భారీగా నగరవాసులు కూడా తిలకించారు. క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, రాజకీయ ప్రముఖులు కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, ఎంపీ రామ్మోహన్నాయుడు, గల్లా జయదేవ్, ప్రముఖ సినీటులు నాగార్జున, రామ్ చరణ్ తేజ్, దుల్కర్ సల్మన్, అఖిల్, మహేష్ బాబు తనయుడు గౌతమ్ తదితరులు ఈ రేస్ తిలకించారు. సచిన్ టెండూల్కర్ సహా క్రికెట్, సినీ ప్రముఖులతో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
ఇబ్బందులున్నాయి కానీ.. ఫార్ములా ఈ రేస్ గర్వకారణమన్న కేటీఆర్
కాగా, హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. దూసుకెళ్తున్న కార్లను చూస్తుంటే ఆనందంగా ఉందని, నగర వాసులకు ఇది కొత్త అనుభూతినిస్తోందన్నారు. అయితే, ఈ రేస్ కారణంగా పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఇందుకు క్షమించాలన్నారు. కానీ, ఇలాంటి గొప్ప ఈవెంట్ నగరంలో నిర్వహించడం మనందరికీ గర్వకారణమన్నారు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తుందని కేటీఆర్ చెప్పారు.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications