ప్రభాస్ ప్రాజెక్ట్ K లో మరో స్టార్ హీరో
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ - కె' (Project K)లో ప్రభాస్ నటిస్తున్నారు. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓ క్రేజీ అప్‌డేట్‌ను పంచుకుంది చిత్రబృందం.
మరో స్టార్ హీరో ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు తెలిపింది. ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నారంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వార్తను చిత్ర బృందం ఖరారు చేసింది. కమల్ హాసన్ సినీ పరిశ్రమకు వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్ట్ కె నిర్మాతలు ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

కమల్ విలన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, దిశా పటానీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ కే 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మునుపెన్నడు చూడని భారీ దృశ్యరూప చిత్రంగా, అతిపెద్ద సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయింది.
'ప్రాజెక్ట్ కె' అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ సినిమా పేరుని, మోషన్ పోస్టర్‌ని జులై 3వ తేదీన అమెరికాలో ఆవిష్కరించనున్నారు. ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కమల్ హాసన్ నటించడంపై ప్రభాస్ ఆనందం వ్యక్తం చేశారు. తన హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణమని, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.

సంక్రాంతికి ముందు సెప్టెంబరు 28వ తేదీన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను హోంబలే ఫిలింస్ చేస్తోంది. ఆదిపురుష్ తర్వాత ఈ సినిమా విడుదల కానుండటంతోపాటు కేజీఎఫ్ 2 తర్వాత నీల్ నుంచి వచ్చే చిత్రం కావడంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని, ప్రభాస్ కు కమర్షియల్ గా సరైన సినిమా సలార్ అవుతుందనే అంచనాలో అభిమానులున్నారు.












Click it and Unblock the Notifications