viral:కల్వకుంట్ల కవిత పక్కనే బండి సంజయ్.. గుస గుస, ఫోటో వైరల్
రాజకీయ ప్రత్యర్థులు ఓకే వేదికపై కలవడం అరుదు.. ఇక పక్క పక్కనే కూర్చొంటే ఆ సీనే వేరు. అవును దానికి రకరకాల కామెంట్లు/ సెటైర్లు వేస్తుంటారు. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాదే హవా. సో.. అదీ ఇదీ అనీ కారుకూతలు కూస్తారు. అలా బండి సంజయ్- కల్వకుంట్ల కవిత మీడియా కంట పడ్డారు. ఇంకేముంది అదీ ఇదీ అని తెగ చర్చ జరుగుతుంది.
అలయ్- బలయ్
దసరా తర్వాత బండారు దత్తాత్రేయ అలయ్ - బలయ్ నిర్వహిస్తుంటారు. ఈ సారి ఆయన కూతురు నిర్వహించారు. రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను వస్తుంటారు. ఆదివారం జలవిహార్‌లో అలయ్ - బలయ్ కార్యక్రమం జరిగింది. రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారు, పారిశ్రామిక, ఇతర రంగాలకు చెందిన వారు హాజరయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలు పక్కపక్కనే కూర్చోవడం అందరినీ ఆకర్షించింది. కూర్చొని వీరిద్దరూ మాట్లాడుకున్నారు. దీంతో వారు మాట్లాడుతుండగా తీసిన ఫొటో..సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

దత్తన్న కూతురు
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి నిర్వహించిన కార్యక్రమానికి, వీవీఐపీలతోపాటు పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌తోపాటు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. యేటా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

హైలైట్ ఇదే
గతంలో దత్తాత్రేయ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగగా, ప్రస్తుతం ఆయన హర్యానా గవర్నర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి దత్తాత్రేయ కుమార్తె నేతృత్వంలో ప్రోగ్రాం జరిగింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం... అతిథులందరూ దుర్గామాత, జమ్మిపూజలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోపాటు కార్యక్రమానికి హాజరైన వారు అంబలి సేవించారు. కానీ కార్యక్రమంలో కవిత- సంజయ్ కూర్చొని మాట్లాడటమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. రాజకీయ ప్రత్యర్థులు ఓకే వేదికపై.. మాట్లాడుకునే ఫోటో మాత్రం వైరల్‌గా మారింది. దీనికి కొందరు ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. పైకి శత్రువుల.. లోన మిత్రువులే అంటూ సెటైర్స్ వేస్తున్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..?












Click it and Unblock the Notifications