హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ లో KTR నెంబర్ 2.. అధికారికంగా ప్రకటించిన KCR

|
Google Oneindia TeluguNews

Recommended Video

KCR Appoints KTR As TRS Working President | Oneindia Telugu

హైదరాబాద్ : రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మహమూద్ అలీకి హోంశాఖ కేటాయించిన గులాబీ బాస్ తాజాగా మరో కీలక నిర్ణయం ప్రకటించారు. ఆయన తనయుడు కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తొలిసారి కావడం విశేషం.

జాతీయస్థాయి రాజకీయాలపై దృష్టి పెడతానని చెబుతూ వచ్చిన కేసీఆర్.. ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఈక్రమంలో పార్టీని కాపాడుకోవడం, మరింత బలోపేతం చేయడానికి తనయుడు కేటీఆర్ భుజస్కందాలపై బాధ్యతలు పెట్టారు.

kcr announced that ktr as party working president

సంస్థాగతంగా పార్టీకి మరింత బలం చేకూర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా పార్టీ సభ్యత్వాలతో పాటు జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయడం తదితర బాధ్యతలు కేటీఆర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ కార్యవర్గ సమావేశానికంటే ముందే గులాబీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. అంతేకాదు సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

English summary
KCR, who has been sworn in as Chief Minister for the second time, is making important decisions. Already another new decision has been announced by the pink boss appointed by the Home Ministry to Mahmood Ali. His son KTR was appointed as working president. This is the first time in TRS party history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X