జూన్ 30 డెడ్ లైన్.. ఎట్టి పరిస్థితుల్లో చెక్ డ్యాం పూర్తికావాల్సిందే.. కేసీఆర్ ఆదేశం
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలోని దేవరకొండ నుంచి కోదాడ వరకు లిఫ్ట్ పథకాల అంచనాలను పూర్తిచేసి టెండర్లను పిలవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి చెరువులు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములను నింపుకోవాలని సూచించారు. జూన్ 30 వరకు మొదటి దశ చెక్ డ్యాంలు పూర్తి చేయాలని కేసీఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. రిజర్వాయర్లలో ఎం.డి.డి.ఎల్. మెయింటేన్ చేయాలన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యూహాన్ని ఖరారు చేయాలని అధికారులకు సూచించారు. కాల్వల మరమ్మతులకు 700 కోట్లు కేటాయించామని తెలిపారు. నెలికల్లు లిఫ్టుకు పాత టెండర్‌ను రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.

Recommended Video
టెండర్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇరిగేషన్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేయాలన్నారు. నియామక ప్రక్రియను బోర్డు ద్వారా సొంతంగా నిర్వహించుకునే విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఖాళీల నివేదికను తనకు తక్షణమే అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాల్వల నిర్వహణకు త్వరలో లష్కర్లు, జేఈల నియామకాలు చేపడతామని చెప్పారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం మూడో పంప్ హౌజ్ పనులు సత్వరమే పూర్తి చేయాలన్నారు. మల్లన్న సాగర్ పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications