KCR: కేసీఆర్ స్కెచ్ తో కన్నడిగుల మైండ్ బ్లాక్, హైదరాబాద్ లో మాజీ సీఎంకు Z+ సెక్యూరిటీ, స్కెచ్ వెనుక ప్లాన్!
హైదరాబాద్/ బెంగళూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్కెచ్ తో కర్ణాటక ప్రజల మైండ్ బ్లాక్ అయ్యింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఈసారి కచ్చితంగా ఇంటికి పంపిస్తామని మంగమ్మశపథం చేసిన కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి స్కెచ్ వేస్తారో అనే విషయం అంతు చిక్కడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారత మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి బెంగళూరుతో సహ ఎక్కడ తిరిగినా సర్వసాధారణంగా తిరుగుతుంటారు.
అయితే హైదరాబాద్ వెళ్లిన కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామికి తెలంగాణ ప్రభుత్వం Z+ కేటగిరి భద్రత ఏర్పాటు చెయ్యడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. కేసీఆర్ స్కెచ్ వెనుక అసలు కథ గురించి తెలుసుకున్న కన్నడిగులు షాక్ అవుతున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ స్కెచ్
కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఈసారి కచ్చితంగా ఇంటికి పంపిస్తామని మంగమ్మశపథం చేసిన కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి స్కెచ్ వేస్తారో అనే విషయం అంతు చిక్కడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులను కలుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావ్ స్కెచ్ లను కొందరు రాజకీయ నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
భారత మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి బెంగళూరుతో సహ ఎక్కడ తిరిగినా సర్వసాధారణంగా తిరుగుతుంటారు. అయితే హైదరాబాద్ వెళ్లిన కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామికి తెలంగాణ ప్రభుత్వం Z+ కేటగిరి భద్రత ఏర్పాటు చెయ్యడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

హైదరాబాద్ కు మాజీ సీఎం హెచ్ డీకే
కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి శనివారం రాత్రి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం) నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 10.55 గంటల సమయంలో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రం చేరుకున్నారు.

ఐటీసీ కాకతీయలో?
శనివారం అర్దరాత్రి 12.15 గంటల సమయంలో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన హెచ్.డీ. కుమారస్వామికి తెలంగాణ ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరి కేటాయించారు. విమానాశ్రయం నుంచి ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్ చేరుకున్న హెచ్ డీ. కుమారస్వామి అక్కడే బసచేశారు

ప్రగతి భవన్ లో చర్చలు
ఈరోజు ( ఆదివారం 11వ తేదీ) మద్యాహ్నం 12.30 గంటలకు కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ చేరుకుంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి వివిద అంశాలపై చర్చలు జరుపనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కేసీఆర్, కుమారస్వామి చర్చలు జరపనున్నారు.

కేసీఆర్ స్కెచ్ తో మైండ్ బ్లాక్
ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న కుమారస్వామి బెంగళూరు చేరుకుంటారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చెయ్యడానికి ప్రాంతీయ పార్టీల నాయకులు అందరిని ఏకం చెయ్యడానికి కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్ తో పాటు వివిద రాష్ట్రాలకు చెందిన నాయకులతో కేసీఆర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications