కీర్తీ తీరు విస్మయం... ! బాల్‌రెడ్డినే పెళ్లి చేసుకుంటా....! బాయ్ సార్ మళ్ళి వస్తానంటున్న కీర్తీ

రెండు రోజుల క్రితం ప్రియుడి మోజులో పడి కన్నతల్లిని కిరాతకంగా బలిగొన్న కీర్తి మనస్తత్వంపై పోలీసులను ఒకింత అశ్చర్యానికి గురిచేస్తోంది. స్వంత తల్లిని చంపినా... ఆమెలో కొంచం కూడ పశ్చాత్తాపం లేదని తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఆమె ప్రవర్తన తీరు పోలీసులను విస్మయానికి గురి చేస్తోంది. దీంతో కీర్తీ వ్యవహారశైలి అమాయకత్వామా... లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దృష్టిపెట్టారు.

బాల్‌రెడ్డినే పెళ్లి చేసుకుంటా...

బాల్‌రెడ్డినే పెళ్లి చేసుకుంటా...

హయత్‌నగర్‌‌లో కన్నతల్లిని కర్కషంగా మట్టుబెట్టేందుకు తన రెండవ ప్రియుడికి సహకరించి జైలుపాలైన కీర్తీ వ్యక్తిగత ప్రవర్తన, ఆమె వ్యవహారాశైలిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈనేపథ్యంలోనే కీర్తీ పలు విషయాలు వెల్లడిస్తుంది. పెళ్లికి ముందే కీర్తీ మొదటి ప్రియుడు బాల్‌రెడ్డి వల్ల గర్భవతి అయి అబార్షన్ చేయించుకున్నా... తిరిగి బాల్‌రెడ్డిని పెళ్లి చేసుకుంటానని చెబుతున్నట్టు తెలుస్తోంది.

బాల్‌రెడ్డితో సానిహిత్యం

బాల్‌రెడ్డితో సానిహిత్యం

పదహారెళ్ల వయస్సులోనే స్వేచ్చా విహారంలో వికసించిన కీర్తి తన ఇంటికి సమీపంలో ఉన్న బాల్‌రెడ్డి అనే యవకుడితో పెరిగిన పరిచయం కాస్త చనువుగా మారింది. దీంతో తన జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని బాల్‌రెడ్డితో పంచుకునేది. ఇక డబ్బు సంపాదనే లక్ష్యంగా మారిన తల్లి రజిత కూడ ఆమెను పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఎదిగే కూతురుకు కావాల్సిన పరిస్థితులను కల్పించని తల్లి,ఓవైపు తాగుడుకు బానిసై కూతురు భవిష్యత్‌కు బాటలు వేసే ప్రయత్నాలు వేయకలేకపోయిన తండ్రి మరోవైపు ఉండడడంతో... ఎవరు ఇంట్లో లేనప్పుడు పక్కింటిలోనే ఉంటున్న బాల్‌రెడ్డి వద్దకు వెళ్లి గడిపేది.

స్వయంగా గర్భ పరీక్షలు

స్వయంగా గర్భ పరీక్షలు

ఈ నేపథ్యంలోనే ఆమే గత సెప్టెంబర్‌లో గర్భం దాల్చినట్టు అనుమానాలు వచ్చాయని చెప్పింది. దీంతో గర్భం దాల్చితే వచ్చే పరిణామాలపై ఇంటర్‌నెట్‌లో వెతికింది. వెంటనే ప్రెగ్నేన్సి కిట్ తెచ్చుకుని స్యయంగా గర్భం దాల్చినట్టు నిర్థారించుకుంది అయితే గర్భం దాల్చిన విషయాన్ని కనీసం తన తల్లికి చెప్పకుండా ఆమే వ్యవహరించింది. మరోవైపు గర్భానికి కారణమైన బాల్‌రెడ్డి కూడ సమయానికి అందుబాటులో లేకుండా బెంగుళూర్ వెళ్లాడు. అప్పుడు తనకు తెలిసిన మరోవ్యక్తి శశికుమార్‌‌కు విషయం చేరవేసింది.అనంతరం విషయం తెలుసుకున్న బాల్‌రెడ్డి, ఆమేకు శశికుమార్ సాయంతో అబార్షన్ చేయించారు.

బై.. సార్ మళ్లి కలుస్తా..

బై.. సార్ మళ్లి కలుస్తా..

ఇక కేసు విషయంలో విచారణ చేసిన హయత్‌నగర్ పోలీసులు అనంతరం కీర్తీని కోర్టులో హజరుపరిచేందుకు తీసుకువచ్చారు. ఇక అప్పుడు కూడ ఆమేలో ఎలాంటీ పశ్చాత్తాపం కన్పించలేదని తెలుస్తోంది. ఇంత జరిగినా బాల్‌రెడ్డిని వివాహం చేసుకుంటానని చెప్పడంతోపాటు .. కోర్టులో ప్రోడ్యుస్ చేసేందుకు వచ్చిన పోలీసులతో వ్యవహరించిన తీరు వారిని అశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. కోర్టుకు వెళుతూ బై...బై.. సార్ మళ్లి కలుస్తా... అంటూ వారికి వీడ్కోలు చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కయినట్టు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+