హైదరాబాద్‌లో భారీగా సెక్స్ డ్రగ్స్.. కిలోలకొద్దీ బయటపడుతున్న కెటామిన్

హైదరాబాద్ : భాగ్యనగరంలో సెక్స్ డ్రగ్స్ కిలోల కొద్దీ బయటపడుతుండటం కలకలం రేపుతోంది. గుర్రాలకు లైంగిక సామర్థ్యం పెంచేందుకు వాడే సెక్స్ డ్రగ్ మార్కెట్‌లో విచ్చలవిడిగా లభ్యమవుతుండటం సంచలనం రేకెత్తిస్తోంది. మొన్నటికి మొన్న నాచారంలో ఫార్మా కంపెనీ పట్టుబడి పది రోజులు కాకముందే మరో సంస్థ పోలీసుల వలకు చిక్కడం చర్చానీయాంశమైంది.

వేలల్లో జీతాలు, పోష్ కల్చర్.. యువతను చెడుదారి పట్టిస్తున్నాయి. వారంలో ఐదు రోజులు పనిచేయడం, రెండు రోజులు విశ్రాంతి కోసం ఆరాటపడటం డ్రగ్స్ విక్రయదారులకు కాసుల పంట కురిపిస్తోంది. ఆ క్రమంలో పుట్టుకొచ్చిన రేవ్ పార్టీలు సెక్స్ డ్రగ్స్ అమ్మకాలకు నెలవుగా మారుతున్నాయి.

సెక్స్ డ్రగ్స్ కలకలం..!

సెక్స్ డ్రగ్స్ కలకలం..!

హైదరాబాద్‌‌లో పది రోజుల కిందట వెలుగు చూసిన సెక్స్ డ్రగ్స్ నిర్వాహకుల బాగోతం మరచిపోకముందే మరో ముఠా గుట్టురట్టైంది. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా పరిధిలోని దూలపల్లిలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం చర్చానీయాంశమైంది. ఓ మూతబడిన కంపెనీలో మత్తు పదార్థాలు తయారవుతున్నాయనే విషయం బయటపడటంతో స్థానికంగా కలకలం రేపింది.

డ్రగ్స్ తయారవుతున్నాయనే పక్కా సమాచారంతో సంబంధిత శాఖ అధికారులు దూలపల్లిలో దాడులు నిర్వహించారు. సెక్స్ డ్రగ్స్‌గా పిలిచే కెటామిన్ మత్తు పదార్థం భారీ స్థాయిలో ప్రొడక్షన్ జరుగుతున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ తయారీకి వినియోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మొన్న నాచారం.. నేడు దూలపల్లి

మొన్న నాచారం.. నేడు దూలపల్లి

ఎక్కడో విదేశాల్లో కనిపించే సెక్స్ డ్రగ్స్ హైదరాబాద్‌లో తయారవుతుండటం కలకలం రేపుతోంది. మొన్న నాచారం, నేడు దూలపల్లి.. ఇంకా ఇలా హైదరాబాద్‌లో ఎన్ని తయారీ కేంద్రాలు ఉన్నాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులో పట్టుబడిన నేరస్థుడి సమాచారం మేరకు పది రోజుల కిందట హైదరాబాద్ నాచారంలో సెక్స్ డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టైంది. ఐదేళ్ల నుంచి ఈ దందా కొనసాగుతుండటం నగరవాసుల్ని విస్మయానికి గురిచేసింది.

గుర్రాల లైంగిక సామర్థం పెంచడానికి..!

గుర్రాల లైంగిక సామర్థం పెంచడానికి..!

నాచారంలో ఇంకెమ్ అనే పేరుతో కెమికల్ ల్యాబ్ అంటూ నడుపుతున్న నిర్వాహకులు.. సెక్స్ డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు తేలింది. కెటామిన్ అనే ఈ మత్తుమందు ఎవరికైనా ఇస్తే 5 గంటల పాటు మత్తులోకి వెళ్లిపోతారట. అలా మత్తులోకి వెళ్లిపోవడమే కాదు.. సెక్స్ కోరికలు కూడా పెరుగుతాయనే టాక్ వినిపిస్తోంది. కొందరు నేరగాళ్లు ఈ డ్రగ్స్ ప్రయోగించి మహిళలను మత్తులోకి దించి అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సెక్స్ డ్రగ్స్ గా పిలిచే కెటామిన్ ను సాధారణంగా గుర్రాల్లో లైంగిక సామర్థం పెంచేందుకు వాడతారని తెలుస్తోంది.

ప్రొడక్షన్ ప్రాసెస్ చాలా డేంజర్ సుమీ

ప్రొడక్షన్ ప్రాసెస్ చాలా డేంజర్ సుమీ

సైకోటోపిక్‌ మిశ్రమ పదార్థాల కేటగిరీలోకి వచ్చే కెటామిన్ తయారీకి కొన్ని రసాయనాలను వినియోగిస్తారు. చీకటి గదిలో మాత్రమే కెటామిన్ తయారుచేస్తారట. రసాయనాలను ప్రాసెసింగ్ చేసి కెటామిన్ ఉత్పత్తి చేసే ప్రక్రియ చాలా డేంజరని తెలుస్తోంది. ఈ సెక్స్ డ్రగ్స్ తయారీలో ఏ చిన్న పొరపాటు జరిగినా.. భారీ విస్ఫోటనం జరిగే ఛాన్సుందట. అయితే నాచారంలో వెలుగుచూసిన ఇంకెమ్ ల్యాబ్ జనవాసాల్లో ఉండటం కలకలం రేపింది. మొత్తానికి అధికారులు సీజ్ చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+