TSPSC పేపర్ లీకేజీ కేసు: సిట్ నివేదికలో కీలకాంశాలు, రాజశేఖర్‌దే పెద్ద పాత్ర
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో ప్రాథమిక నివేదికను సిట్ అధికారులు టీఎస్‌పీఎస్సీ(TSPSC)కి అందజేశారు. సిట్ నివేదికలో అధికారులు పలు కీలక విషయాలు వెల్లడించారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో ప్రాథమిక నివేదికను సిట్ అధికారులు టీఎస్‌పీఎస్సీ(TSPSC)కి అందజేశారు. సిట్ నివేదికలో అధికారులు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. ఈ నివేదిక ఆధారంగానే టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన నాలుగు పరీక్షలను రద్దు చేసింది.
పేపర్ లీక్‌లో కీలక సూత్రధారి ప్రవీణ్‌తో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ చేతులు కలిపాడు. ఉద్దేశపూర్వకంగానే టీఎస్‌పీఎస్సీకి వచ్చిన రాజశేఖర్ ఏడేళ్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పథకం ప్రకారమే ప్రవీణ్‌తో సంబంధాలు కొనసాగించాడు. కంప్యూటర్ హ్యాక్ చేసి పాస్‌వర్డ్ దొంగిలించింది రాజశేఖరేనని సిట్ నివేదిక స్పష్టం చేసింది.

శంకరలక్ష్మి తన డైరీలో రాసుకున్న పాస్‌వర్డ్‌ను తస్కరించి కంప్యూటర్‌లో చొరబడినట్లు ప్రవీణ్ చెబుతున్నాడు.. కానీ, పాస్‌వర్డ్‌ని తాను ఎక్కడా రాయలేదని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి వరలక్ష్మి స్పష్టం చేశారు. పెన్ డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను రాజశేఖర్ కాపీ చేశాడు. కాపీ చేసిన పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇవ్వగా.. అతను ఏఈ ప్రశ్నపత్రాన్ని రేణుకకు విక్రయించాడని సిట్ నివేది పేర్కొంది.
గ్రూప్-1 ప్రశ్నపత్రం కూడా లీకైనట్లు గుర్తించామని తెలిపింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి దగ్గర పీఏగా ప్రవీణ్ ఏడాదిన్నరగా పనిచేస్తున్నాడని సిట్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. సెక్రటరీ దగ్గర పీఏగా పనిచేస్తూ గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ ను కొట్టేసినట్లు సిట్ నిర్దారించింది. కాగా, ఈ పేపర్ లీక్‌లో రాజశేఖర్‌దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది నిందితులకు మరో ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. నిందితులను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కు స్పందించిన కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. నిందితులను మార్చి 18 నుంచి మార్చి 23 వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. పూర్తి విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications