disha murder case:ముగిసిన నిందితుల తొలిరోజు కస్టడీ, కీలక ఆధారాలు సేకరణ

దిశ లైంగికదాడి, హత్య కేసులో నిందితులు మహ్మద్, బొల్లు శివ, నవీన్, చింతకుంట చెన్నకేశవులు తొలిరోజు కస్టడీ ముగిసింది. నిందితులను చర్లపల్లి జైలులోనే విచారించారు. వారిని బయటకు తీసుకొచ్చి విచారించే పరిస్థితి లేనందున.. జైలులోనే ఘటనకు సంబంధించి వివరాలు రాబడుతున్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కూడా అర్ధరాత్రి చేపట్టారు. డే సమయంలో నిర్వహిస్తే స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదరవుతుందని ఈ మేరకు జాగ్రత్తలు తీసుకున్నారు.

తొలిరోజు కస్టడీలో భాగంగా నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరించారు. నిందితులు లారీలో కూడా తనిఖీలు చేప్టారు. దిశ బ్లడ్ శాంపిల్స్‌ను క్లూస్ టీం సేకరించంది. తల వెంట్రుకలను కూడా స్వాధీనం చేసుకున్నారు. లారీ క్యాబిన్‌లో కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. దిశ ఫోన్ తుండుపల్లి టోల్‌గేట్ సమీపంలో పాతిపెట్టినట్టు గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు.

key Evidence in disha murder case interrogation

మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రిలిమినరీ చార్జ్‌షీట్ వేసేందుకు సిట్ సిద్ధమవుతుంది. దిశ కేసు విచారణను ఏడు బృదాలు చేపడుతాయి. ఒక్కో బృందంలో ఏడుగురు పోలీసులు ఉంటారు. కమిషనర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు ఇన్వెస్టిగేషన్ చార్జ్‌షీట్ దాఖలు చేసేవరకు టీం పనిచేస్తాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

వరంగల్‌లో చిన్నారిపై కీచకుడు ప్రవీణ్ లైంగికదాడిపై నిరసనలు పెల్లుబికిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసింది. వాదనల తర్వాత 60 రోజుల్లోనే కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దిశ విషయంలో కూడా 45 రోజులకు మించకుండా నిందితులకు ఉరి శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అందులోభాగంగానే ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+