కింగ్ ఫిషర్ బీర్ పౌడర్ వచ్చేసింది
ఎండలు మండే కాలంలో చేతిలో చల్లగా బీర్ సీసా ఉంటే బాగుండు అని చాలామంది అనుకుంటారు. వారికోసమే ఇప్పుడు బీర్ పౌడర్ మిక్స్ మార్కెట్ లోకి వచ్చింది.మనదేశంలో లీడింగ్ బీర్ బ్రాండ్ గా ఉన్న కింగ్ ఫిషర్ ఇన్ స్టంట్ బీర్ ప్యాకెట్లు వచ్చాయి. యునైటెడ్ బ్రివరీస్ గ్రూప్ సంస్థ కింగ్ ఫిషర్ ఇన్ స్టంట్ బీర్ ను విడుదల చేసింది. ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీతో బీర్ సాచెట్స్ పౌడర్ ను దేశంలోని వినియోగదారుల కోసం విడుదల చేసింది.
బీర్ పౌడర్ మిక్స్.. వీటినే బీర్ సాచెట్స్ అని పిలుస్తుంటారు. ఈ బీర్ పౌడర్ తో బీరు తయారు చేయడం ఎలా అంటే.. బీర్ సాచెట్స్ , నీళ్లు ఉంటే చాలు.. క్షణాల్లో బీర్ సిద్ధమవుతుంది. మీకు దగ్గరలో జగ్ కానీ, మగ్ కానీ, మినరల్ వాటర్ డబ్బాకానీ ఏది వున్నా ఒకేసారి బీర్ పౌడర్ కలిపి బీరు తయారుచేసుకోవచ్చు.

పార్టీలు కూడా చేసుకోవచ్చు. నురగలు కక్కే రుచికరమైన బీరును సులువుగా తయారుచేసుకోవచ్చు. వెంటనే బీర్ పౌడర్ ప్యాకెట్ల కోసం ఆర్డర్ చేయండి.. కింగ్ ఫిషర్ బీర్ పౌడర్ తో బీర్ తయారీకి సంబంధించి సంస్థ యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో వైరల్ గా మారింది.
బీర్ పౌడర్ శాంపిల్స్ కోసం రిజిస్టర్ చేసుకునేందుకు కింగ్ ఫిషర్ అవకాశం కల్పించింది. కిక్ ఎక్కించే టేస్టీ బీర్ ను రుచి చూడాలంటే.. kingfisherworld.com/instantbeer లో రిజిస్టర్ చేసుకోండి.
అది నిజమైనది కాదని, ప్రజల్ని ఫూల్స్ చేయడానికి ఇలా వీడియో పెట్టారంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు. మరికొందరు మాత్రం నిజమే అని చెబుతున్నారు. వీడియోలో కూడా ఇన్ స్టంట్ బీర్ పౌడర్ ను చూపించడంతో బీరు ప్రియులంతా తమ పేర్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications