హాస్పటల్ లో ఉపాసన డెలివరీకి ఎంత ఖర్చైందో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులంతా ఈ వార్తతో ఎంతో ఖుషీ అయ్యారు. ఏ పేరు పెడితే బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది. ఈ బిడ్డను తమ అదృష్టంగా భావిస్తున్నామని, అపురూపంగా చూసుకుంటామని మీడియా ముందు చిరంజీవి చెప్పారు. పాప నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆంజనేయస్వామి దేవాలయాల్లో పూజలు కూడా నిర్వహించారు.
రామ్ చరణ్ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కృతఙ్ఞతలు తెలియజేశారు. పెద్ద పెద్ద వైద్యులంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి డెలివరీ విషయంలో తాము అసలు భయపడలేదని, చాలా సజావుగా సాగిందని చెప్పారు. అలా సజావుగా సాగడానికి చాలా ఖర్చు అయింది. విదేశాల నుంచి వైద్యులను పిలిపించి మరీ డెలివరీ చేయించారు. ఈ ఖర్చు రూ.1.50 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఉపాసన డెలివరీ సేఫ్ గా జరగడం కోసం, డెలివరీ అయిన తర్వాత పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉందా? లేదా? అని పరీక్షించడానికి, ఒకవేళ ఏదైనా అనుకోని సమస్య ఎదురైతే వాటిని పరిష్కరించగలిగే స్పెషలిస్టులను కూడా పిలిపించారు. అలా ఒక మహారాణిలా ఆ పాప భూమిమీదకు అడుగు పెట్టింది. అభిమానులంతా పాపను రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నారు. ఏ పేరు పెట్టేది జులైలో అధికారికంగా ప్రకటిస్తానని రామ్ చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే.
డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఉపాసన చలాకీగా తిరిగివెళ్లారు. అందుకు ఆమె తీసుకునే డైట్ కారణమని ప్రముఖ వైద్యులు ఒకరు తెలిపారు. ఉపాసన డైట్ లో లోటస్ సీడ్స్ కచ్చితంగా ఉంటాయి. వీటిలో ప్రొటీన్లు ఎక్కువ. అలాగే గుమ్మడి గింజలు తీసుకుంటారు. దీనిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఉపాసన రెండు గ్లాసుల వేడినీళ్లు తాగుతుంది. తర్వాత ఒక గ్లాస్ లెమన్ వాటర్ తీసుకుంటుంది.
అనంతరం బుల్లెట్ టీ తాగుతుంది. ఉదయం తిన్న తరువాత 8 గంటల వరకూ మళ్లీ ఏమీ తినరు. రెండోసారి తిన్న తరువాత 16 గంటల గ్యాప్ ఉంటుంది. ఉదయం టిఫిన్ ఎక్కువగా తిని.. సాయంత్రం ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఆ తర్వాత16 గంటల వరకూ మళ్లీ ఎటువంటి ఆహారం తీసుకోరు.












Click it and Unblock the Notifications